Rajasthan HPCL రిఫైనరీలో ఏం జరిగింది.. నిజంగానే ఉగ్రవాదులు కుట్ర చేశారా..

23, 2026 - 14:31
 0
Rajasthan HPCL రిఫైనరీలో ఏం జరిగింది.. నిజంగానే ఉగ్రవాదులు కుట్ర చేశారా..
Rajasthan HPCL refinery incident

Rajasthan HPCL refinery incident: ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ప్రారంభానికి నోచుకోవాల్సిన HPCL రిఫైనరీ లో అగ్ని ప్రమాదం జరగడంతో దేశవ్యాప్తంగా చర్చ మొదలైంది. మంగళవారం ఈ రిఫైనరీని ప్రారంభించి.. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ జాతికి అంకితం ఇవ్వాలి అనుకున్నారు. కానీ దురదృష్టవశాత్తు అగ్నిప్రమాదం జరగడంతో రిఫైనరీ లో చాలా వరకు భాగం కాలిపోయింది. ఏకంగా 20 అగ్నిమాపక యంత్రాలు మంటలను ఆపడానికి ప్రయత్నించాయంటే.. అక్కడ ప్రమాదం ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. కోట్ల రూపాయల నష్టం జరిగిందని అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు.

రాజస్థాన్ రాష్ట్రంలో నిర్మించిన ఈ ప్రాజెక్టు.. 2013 సెప్టెంబర్ 22న సోనియాగాంధీ చేతుల మీదుగా శంకుస్థాపన చేశారు. నాడు రాజస్థాన్ రాష్ట్రంలో అశోక్ గెహ్లాట్ ముఖ్యమంత్రిగా ఉన్నారు.. అప్పట్లో దీని అంచనాను 37,230 కోట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత దానిని 2018 జనవరి 16న పున ప్రారంభించారు. నాడు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ చేతుల మీదుగా ఈ కార్యక్రమం జరిగింది. అప్పుడు దీని అంచనా వ్యయాన్ని 43, 219 కోట్లకు పెంచారు. ఆ తర్వాత ఈ ప్రాజెక్టును దేశీయ అవసరాలకు మరింత గొప్పగా విస్తరించాలని అధికారులు నిర్ణయించారు. ఈ నేపథ్యంలోనే ప్రాజెక్టు ఖర్చును 79,450 కోట్లకు పెంచారు. మొత్తంగా ప్రాజెక్టు పూర్తయిన తర్వాత నరేంద్ర మోడీ ఏప్రిల్ 21న దీనిని ప్రారంభించాలి.. నరేంద్ర మోడీ మంగళవారం వస్తున్నారని తెలియడంతో అక్కడ కేంద్ర బలగాలు మోహరించాయి. బందోబస్తును ముమ్మరం చేశాయి. రాజస్థాన్ రాష్ట్రంలోని బలోత్ర ప్రాంతంలో పచ్ పద్ర వద్ద దీనిని నిర్మించారు. మన దేశంలో దీనిని మొట్టమొదటి గ్రీన్ఫీల్డ్ సమీకృత రిఫైనరీ కం పెట్రో కెమికల్ కాంప్లెక్స్ గా పేర్కొంటున్నారు.. దీనిని రాజస్థాన్ ప్రభుత్వం, హిందుస్థాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్వహించడానికి ఒప్పందం కుదుర్చుకున్నాయి.

నరేంద్ర మోడీ ప్రారంభించడానికి ముందు ఈ ప్రాజెక్టులో అగ్నిప్రమాదం జరగడం ఆందోళన కలిగిస్తోంది. మంటలు కూడా విపరీతంగా వచ్చాయి. అయితే ఈ ప్రమాదం వెనుక ఉగ్రవాదుల కుట్ర ఉందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే దర్యాప్తు సంస్థలు విచారణను వేగం చేశాయి. ఇటీవల కాలంలో ఆస్ట్రేలియా, ఇరాక్, అమెరికా, మెక్సికో, ఈక్వేడర్ ప్రాంతంలో ఈ తరహా ప్రమాదాలు జరిగాయి. రోమానియా ప్రాంతంలో థర్మల్ పవర్ ప్లాంట్ లో ఈనెల 20న అగ్ని ప్రమాదం జరిగింది. ఇవన్నీ చూసుకుంటే ఒక ప్యాటర్న్ ఉందని తెలుస్తోంది. దీనిపై ఇప్పటికే నేషనల్ ఇన్వెస్టిగేషన్ ను ఏజెన్సీ, యాంటీ టెర్రర్ స్క్వాడ్ ప్రారంభించాయి.

ఇటీవల కాలంలో మిడిల్ ఈస్ట్ ప్రాంతంలో యుద్ధం జరుగుతోంది. దీంతో దేశీయంగా పెట్రోల్ అవసరాలు పెరిగిపోయాయి. ఈ నేపథ్యంలో దేశంలో భవిష్యత్తు కాలంలో ఏవైనా అవాంతరాలు చోటు చేసుకున్నప్పుడు.. భారీగా నిల్వలు పెంచుకొని.. ప్రజలకు ఇబ్బందులు లేకుండా చూడాలనేవి ప్రభుత్వ లక్ష్యం. అందువల్లే ఈ స్థాయిలో రిఫైనరీలు నిర్మిస్తోంది. రాజస్థాన్ రాష్ట్రంలో నిర్మించిన ఈ రిఫైనరీ ఇప్పుడు ఈ స్థాయిలో అగ్ని ప్రమాదానికి గురి కావడం ఆందోళన కలిగిస్తోంది.

0
0
0
0
0
0
0