Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!

23, 2026 - 14:31
 0
Lava Bold N1 5G కొత్త వేరియంట్ లాంచ్.. ధర కూడా తక్కువే.!
Lava Bold N1 5g New Variant Launched At Just Rs 11999 Specs Features And Price Are

Lava Bold N1 5G: దేశీయ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్ లావా ఇంటర్నేషనల్ (Lava International) నుండి Bold N1 5G స్మార్ట్‌ఫోన్‌ను కొత్త 6GB + 128GB వేరియంట్‌ లో విడుదల చేసింది. గత ఏడాది విడుదలైన 4GB + 64GB, 4GB + 128GB మోడళ్లకు ఇది కొత్త అదనంగా మార్కెట్లోకి వచ్చింది. తక్కువ ధరలో 5G ఫోన్ కావాలనుకునే వారికి ఇది మంచి ఆప్షన్‌గా నిలుస్తోంది.

ఈ ఫోన్‌లో 6.75 ఇంచుల HD+ LCD డిస్‌ప్లే ఉంది. 90Hz రిఫ్రెష్ రేట్‌తో స్మూత్ స్క్రోలింగ్ అనుభవాన్ని అందిస్తుంది. పనితీరు కోసం UNISOC T765 ప్రాసెసర్‌ను అందించారు. ఇది 6nm టెక్నాలజీతో రూపొందించబడింది. అంతేకాకుండా ఆండ్రాయిడ్ 15 క్లిన్ వెర్షన్‌తో వస్తుండటం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు. ఎలాంటి బ్లోట్‌వేర్ లేకుండా సాఫ్ట్‌వేర్ అనుభవం ఉంటుంది.

Image (9)

కెమెరా విషయానికి వస్తే ఈ ఫోన్‌లో 13MP రియర్ కెమెరా, 5MP ఫ్రంట్ కెమెరా ఉన్నాయి. 4K వీడియో రికార్డింగ్ సపోర్ట్ కూడా ఉంది. బ్యాటరీగా 5000mAh సామర్థ్యం కలిగి ఉండి, 18W ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. అయితే బాక్స్‌లో 10W చార్జర్ ఇవ్వబడుతుంది. స్టోరేజ్ పరంగా 4GB/6GB RAM ఆప్షన్లు, 64GB/128GB ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తాయి. దీనిని మైక్రోSD కార్డ్ ద్వారా 1TB వరకు విస్తరించుకోవచ్చు.

ఈ మొబైల్ కు సైడ్ మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ స్కానర్, IP54 డస్ట్ & స్ప్లాష్ రెసిస్టెన్స్ వంటి ఫీచర్లు కూడా ఉన్నాయి. ఈ ఫోన్ షాంపైన్ గోల్డ్, రాయల్ బ్లూ రంగుల్లో లభిస్తుంది. 6GB + 128GB వేరియంట్ ధర రూ. 12,499గా నిర్ణయించారు. లాంచ్ ఆఫర్‌లో భాగంగా ఇది రూ. 11,999కి అమెజాన్ లో మే 1 నుంచి అందుబాటులోకి రానుంది. బడ్జెట్ సెగ్మెంట్‌లో మంచి ఫీచర్లతో లావా Bold N1 5G వినియోగదారులకు బెస్ట్ ఛాయిస్ కానుంది.

0
0
0
0
0
0
0