Motorola పాత ఫోన్ పై రూ.6000 డిస్కౌంట్.. వెంటనే తెలుసుకోండి..

23, 2026 - 14:31
 0
Motorola పాత ఫోన్ పై రూ.6000 డిస్కౌంట్.. వెంటనే తెలుసుకోండి..
Motorola Edge 60 Fusion

Motorola Edge 60 Fusion: Motorola ఫోన్లకు మార్కెట్లో విపరీతమైన డిమాండ్ ఉంది. ఈ కంపెనీ నుంచి ఇటీవల రిలీజ్ అయిన fusion సిరీస్ కొనుగోలుపై చాలామంది ఆసక్తి చూపుతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో మోటరోలా ఎడ్జ్ 70 Fusion మొబైల్ ఆదరణ పొందుతోంది. అయితే ఇదే సమయంలో తమ పాత ఫోన్లను సేల్స్ చేసుకోవడానికి కంపెనీ ఆఫర్లు ప్రకటించింది. ఈ కంపెనీ నుంచి ఇప్పటికే మార్కెట్లోకి వచ్చిన మోటరోలా ఎడ్జ్ 60 Fusion మొబైల్ పై భారీ డిస్కౌంట్ను ప్రకటించారు. దీంతో ఇప్పటివరకు దీనిని కొనలేని వారు ఇప్పుడు తక్కువ ధరకే కొనుగోలు చేయవచ్చు. అయితే దీనిపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో ఇప్పుడు చూద్దాం..

Motorola Edge 60 Fusion 2025 ఏప్రిల్ 2న మార్కెట్లోకి వచ్చింది. ఇది రిలీజ్ అయిన సమయంలో 128 జీబీ స్టోరేజ్ కలిగిన మొబైల్ ధర రూ.24,999 తో విక్రయించారు. అయితే ప్రస్తుతం దీనిని కొనుగోలు చేసిన వారికి 8% ప్లాట్ డిస్కౌంట్ లభించనుంది. దీంతో ఈ మొబైల్లో రూ.22,999 లోపే పొందవచ్చు. ఇది మాత్రమే కాకుండా దీనిపై బ్యాంకు క్రెడిట్ కార్డు డిస్కౌంట్ కూడా లభించనున్నాయి. ఈ కామర్స్ మార్కెట్ ఫ్లిప్కార్ట్ ద్వారా ఈ మొబైల్ లో యాక్సిస్, ఎస్బిఐ బ్యాంక్ క్రెడిట్ ద్వారా కొనుగోలు చేస్తే రూ.1,550 వరకు డిస్కౌంట్ లభించే అవకాశం ఉంది. వీటితోపాటు అదనంగా ఎక్స్చేంజి బోనస్ కూడా పొందవచ్చు. అయితే ఈ బోనస్ రావాలంటే బ్రాండెడ్ కలిగిన మొబైల్ ఉండాలి. ఈ బోనస్ దాదాపు రూ.16,000 వరకు ఉండొచ్చు. ఇలా అన్ని ఆఫర్స్ కలిపి దాదాపు రూ.6000 వరకు ప్రయోజనాలను పొందవచ్చు.

అయితే ఈ మొబైల్ పై ధర తగ్గించినప్పటికీ ఇందులో ఉండే ఫీచర్స్ అద్భుతం అని కొందరు చెబుతున్నారు. ఈ మొబైల్లో 6.67 అంగుళాల డిస్ప్లే ఉండనుంది. ఇది 1.5 K Resolution తో పనిచేస్తుంది.. అలాగే ఇందులో మీడియా టెక్ డైమెన్సిటీ 7400 ప్రాసెసర్ ఉండనుంది. ఈ ప్రాసెసర్ మల్టీ టాస్కింగ్ కోసం యూస్ చేసేవారికి బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో 8gb నుంచి 12 జిబి వరకు రామ్ సపోర్ట్ చేయనుంది. ఈ మొబైల్లో 50 ఎంపీ సోనీ లైటియా మెయిన్ కెమెరా ఉంటుంది. అలాగే 13 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్ తో పనిచేస్తుంది. 32 మెగాపిక్ సెల్ ఫ్రంట్ కెమెరాతో పాటు వీడియో కాలింగ్ పనిచేస్తుంది.

మోటరోలా ఎడ్జ్ 60 Fusion మొబైల్ లో బ్యాటరీ వ్యవస్థ బలంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 5500 mAh బ్యాటరీ ఉండనుంది. ఈ బ్యాటరీ 68 W ఫాస్ట్ ఛార్జింగ్ కు సపోర్ట్ చేస్తుంది. రోజువారి వినియోగదారులతోపాటు గేమింగ్ కోరుకునే వారికి ఈ మొబైల్ అనుకూలంగా ఉండనుంది.

0
0
0
0
0
0
0