ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు.. అంతా నా దురదృష్టం: మమిత బైజు

23, 2026 - 14:31
 0
ఇలా జరుగుతుందని కలలో కూడా ఊహించలేదు.. అంతా నా దురదృష్టం: మమిత బైజు
Mamitha Baiju emotional statement

Mamitha Baiju emotional statement: ‘ప్రేమలు’ అనే యూత్ ఫుల్ లవ్ స్టోరీ తో సౌత్ ఇండియా లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ని సంపాదించుకున్న యంగ్ హీరోయిన్ మమిత బైజు(Mamitha Baiju). కేవలం ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ రేంజ్ కి ఎదగడం , అది కూడా సౌత్ మొత్తం మంచి క్రేజ్ ని సంపాదించుకోవడం అనేది చాలా అరుదు. ఆ అరుదైన అదృష్టాన్ని దక్కించుకొని ముందుకుపోతున్న మమిత బైజు , గత ఏడాది ‘డ్యూడ్’ సినిమాతో మరో భారీ బ్లాక్ బస్టర్ హిట్ ని తన ఖాతాలో వేసుకున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రం తర్వాత ఆమె కీలక పాత్ర పోషించిన ‘జన నాయగన్’ చిత్రం జనవరి 9 న సంక్రాంతి కానుకగా విడుదల కావాల్సి ఉంది. కానీ సెన్సార్ బోర్డు నుండి సర్టిఫికేట్ రాకపోవడంతో ఇప్పటి వరకు ఈ సినిమా విడుదల కాలేకపోయింది.

దానికి తోడు రీసెంట్ గా ఈ చిత్రం ఎడిటింగ్ రూమ్ నుండి లీక్ అవ్వడం , ఆ సినిమాకు సంబంధించిన సన్నివేశాలన్నీ సోషల్ మీడియా లో బాగా వైరల్ అవ్వడం వంటివి అభిమానులను తీవ్రమైన నిరాశకు గురి అయ్యేలా చేసింది. అయితే ఈ విషయం పై మమిత బైజు రీసెంట్ గా జరిగిన ఒక ఇంటర్వ్యూ లో చెప్పుకొస్తూ చాలా ఎమోషనల్ అయ్యింది. ఆమె మాట్లాడుతూ ‘ముందుగా ఈ సినిమా సోషల్ మీడియా లో లీక్ అయ్యింది అంటూ నా తమ్ముడు చెప్పిన మాటలను నేను నమ్మలేదు. ఆ తర్వాత అది నిజమని తెలుసుకొని చాలా బాధ పడ్డాను. ఈ సినిమా కోసం మేమంతా ఎంతో కష్టపడి పని చేశాము. ఇలా లీక్ అవ్వడాన్ని చూసి కుమిలిపోయాము. అంత మా దురదృష్టం’ అంటూ ఆమె ఎమోషనల్ గా చెప్పుకొచ్చింది. ఎప్పుడూ చలాకీగా మాట్లాడుతూ హుషారుగా ఉండే మమిత బైజు ఇలా ఒక్కసారిగా ఎమోషనల్ గా మాట్లాడడం అభిమానులకు కాస్త బాధగా అనిపించింది.

ఇకపోతే ఈ మలయాళం బ్యూటీ తెలుగు లో ఇప్పటి వరకు ఎలాంటి సినిమాలను ఒప్పుకోలేదు కానీ , తమిళం లో మాత్రం వరుసగా సినిమాలు చేసుకుంటూ వస్తుంది. ఇప్పటికే సూర్య తో ‘విశ్వనాథం & సన్స్ ‘ చిత్రం లో హీరోయిన్ గా నటించిన మమిత, ధనుష్ తో కలిసి ‘కారా’ అనే చిత్రంలో కూడా నటించింది. ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ని రీసెంట్ గానే విడుదల చేశారు మేకర్స్. దీనికి ఆడియన్స్ నుండి అద్భుతమైన రెస్పాన్స్ వచ్చింది. ఈ రెండు సినిమాలు మాత్రమే కాకుండా , మలయాళం మరో మూడు సినిమా చేస్తుంది. చూస్తుంటే రాబోయే రోజుల్లో ఈమె చాలా పెద్ద పాన్ ఇండియన్ స్టార్ అయ్యేలాగానే కనిపిస్తోంది, చూడాలి మరి ఏమి జరగబోతుంది అనేది.

0
0
0
0
0
0
0