వాహనదారులకు గుడ్‌ న్యూస్‌.. పెట్రోల్‌ ధరలపై కేంద్రం కీలక ప్రకటన..!

23, 2026 - 14:31
 0
వాహనదారులకు గుడ్‌ న్యూస్‌.. పెట్రోల్‌ ధరలపై కేంద్రం కీలక ప్రకటన..!
Petrol Price cut

Petrol Price cut: పశ్చిమాసియా యుద్ధం కారణంగా దేశంలో చమురు కొరత నెలకొంది. ఇప్పటికే ఎల్పీజీ ధరను కేంద్రం పెంచింది. యుద్ధం ముగిసే సూచనలు కనిపించడం లేదు. సీజ్‌ఫైర్‌ కుదిరినా శాశ్వత శాంతి ప్రయత్నాలు ఫలించడం లేదు. మరోవైపు హర్మూజ్‌లో ఇప్పుడు అమెరికా పట్టు సాధించింది. ఈ నేపథ్యలో చమురు ధరలు పెరుగుతాయని ప్రచారం జరుగుతోంది. ఈ క్రమంలో కేంద్ర పెట్రోలియం శాఖ అధికారులు పెట్రోల్, డీజిల్‌ ధరల పెంపు గురించి వ్యాప్తమైన ఆందోళనలను తొలగించారు. ప్రభుత్వ స్థాయిలో అలాంటి ప్రతిపాదనలు లేవని ప్రకటించింది.

సోషల్‌ మీడియాలో పుకార్లు..
సోషల్‌ మీడియాలో పెట్రోల ధరలు రూ.5 నుంచి 10 వరకు ధరలు పెరుగుతాయనే తప్పుడు సమాచారం వ్యాప్తి చెందింది. ఈ వార్తలు వాహనదారులు, వ్యాపారుల్లో టెన్షన్‌కు కారణమయ్యాయి. కేంద్రం ట్విట్టర్‌ ద్వారా తక్షణ స్పందించి, ఇలాంటి ప్రణాళికలు లేనటి వాస్తవాన్ని ప్రకటించింది.

4 ఏళ్ల స్థిరత్వం..
40 ఏళ్లుగా ఇంధన ధరల్లో మార్పు లేకుండా ఉన్న ఏకైక దేశం భారత్‌. అంతర్జాతీయ క్రూడ్‌ ఆయిల్‌ ధరలు 70–80 డాలర్ల మధ్య ఊపందుకున్నా, ప్రభుత్వం పోషక విధానాలతో పౌర భారాన్ని తగ్గించింది. ఈ స్థిరత్వం వాహన రవాణా, వ్యవసాయం, చిన్న వ్యాపారాలకు మేలు చేస్తోంది.

ప్రపంచవ్యాప్తంగా ప్రభావం..
ప్రపంచవ్యాప్తంగా ఇంధన ధరలు 20–30 శాతం పెరిగిన సమయంలో భారత్‌ ప్రభుత్వం పౌరాభివృద్ధి దృష్ట్యా చర్యలు తీసుకుంటోంది. డీజిల్‌పై వెయ్యి కోట్ల సబ్సిడీ, పెట్రోల్‌పై పన్ను తగ్గించి ధరలను అదుపులో ఉంచింది. దీంతో వీలయినంత తక్కువ ధరలతో పౌరులకు అందిస్తున్నారు.

తప్పుడు ప్రచారంతో ప్రజల్లో గందరగోళం నెలకొంది. తాజాగా ప్రభుత్వం ముందస్తు సమాచారంతో అనవసర భయాలను నివారిస్తోంది. ఆర్థిక స్థిరత్వం కోసం ఇంధన విధానం మరింత బలపడుతుందని అంచనా.

0
0
0
0
0
0
0