Vijay Varma: తమన్నా చాప్టర్ క్లోజ్.. ఆలియా తో విజయ్ వర్మ డేటింగ్?

23, 2026 - 11:32
 0
Vijay Varma: తమన్నా చాప్టర్ క్లోజ్.. ఆలియా తో విజయ్ వర్మ డేటింగ్?
Vijay Varma Dating Jawan Actress Aaliyah Qureishi Dinner Date Viral Video

టాలీవుడ్ మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా, బాలీవుడ్ నటుడు విజయ్ వర్మల ప్రేమాయణం ఒకప్పుడు ఇండస్ట్రీలో ఒక వెలుగు వెలిగింది. అయితే, గత ఏడాది వీరు పరస్పర అంగీకారంతో విడిపోవడంతో ఆ బంధం ముగిసింది. అయితే తాజాగా విజయ్ వర్మ ముంబై వీధుల్లో మరో యువ నటితో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతూ కనిపించడం ఇప్పుడు కొత్త ఊహాగానాలకు తెరలేపింది. ఆ అమ్మాయి మరెవరో కాదు..

షారుఖ్ ఖాన్ బ్లాక్ బస్టర్ హిట్ ‘జవాన్’లో తన నటనతో మెప్పించిన ఆలియా ఖురేషీ (Aaliyah Qureishi). ముంబైలోని బాంద్రా ప్రాంతంలో ఉన్న ఒక ప్రముఖ జపనీస్ రెస్టారెంట్ నుంచి విజయ్ వర్మ, ఆలియా ఖురేషీ కలిసి బయటకు వస్తుండగా పాపరాజీల కెమెరాకు చిక్కారు. వీరిద్దరూ చాలా క్యాజువల్ డ్రెస్‌లలో, మొహమాట పడకుండా కెమెరాలకు ఫోజులివ్వడం విశేషం. డిన్నర్ ముగించుకుని కారులోకి వెళ్లిన తర్వాత కూడా చాలా సేపు ఏకాంతంగా చర్చించుకుంటూ నవ్వుతూ కనిపించారు. ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ కావడంతో, ‘విజయ్ వర్మ లైఫ్‌లోకి కొత్త ప్రియురాలు వచ్చిందా?’ అంటూ కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఆలియా ఖురేషీ కేవలం నటి మాత్రమే కాదు, ఆమె ఒక ప్రతిభావంతురాలైన సింగర్ మరియు సాంగ్‌రైటర్ కూడా. మరి ఆలియాతో ఉన్నది కేవలం స్నేహమేనా లేక అంతకుమించి ఏదైనా ఉందా అనేది కాలమే నిర్ణయించాలి.

0
0
0
0
0
0
0