ఢిల్లీ హైకోర్టు మెట్లు ఎక్కిన అల్లు అర్జున్.. ఇకపై అలాంటి పోస్టులు పెడితే అరెస్ట్ తప్పదు..

Allu Arjun: సోషల్ మీడియా లో తారా స్థాయి నెగెటివిటీ ని సొంతం చేసుకున్న హీరో ఎవరైనా ఉన్నారా అంటే అది ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) మాత్రమే. ప్రీ రిలీజ్ ఈవెంట్స్ లో ఆయన మాట్లాడే మాటలు ఒక రేంజ్ ట్రోల్స్ కి గురి అవుతుంటాయి. అంతే కాకుండా పవన్ కళ్యాణ్ , ఎన్టీఆర్ , ప్రభాస్ , రామ్ చరణ్ అభిమానులు అల్లు అర్జున్ ని దుర్భాషలాడుతూ చేసే కామెంట్స్, ఆయన పై చేసే మార్ఫింగ్స్ వగైరా వంటివి చూస్తే, ఒక మనిషి పై ఇంత నెగెటివిటీ ఎలా సాధ్యం అని అనిపించక తప్పదు. రీసెంట్ గానే అల్లు అర్జున్ 42 రూల్స్ మీద జాతీయ స్థాయిలో ట్రోలింగ్ జరిగింది. ఇప్పటికీ దీని గురించి మాట్లాడుకుంటూ ఉంటారు. అయితే ఇకపై సోషల్ మీడియా లో అల్లు అర్జున్ మీద ట్రోల్స్ ఇష్టమొచ్చినట్టు వేస్తే జైలు లో కూర్చొని ఊచలు లెక్కపెట్టక తప్పదు.
పూర్తి వివరాల్లోకి వెళ్తే తన వ్యక్తిగత ఫోటోలను , పేర్లను వాణిజ్య ప్రయోజనాలకు వాడుకోనివ్వకుండా, రక్షణ కలిపించాలంటూ అల్లు అర్జున్ ఢిల్లీ హై కోర్టు ని ఆశ్రయించాడు. అంతే కాకుండా AI ద్వారా తన ఫోటోలను మార్ఫింగ్ చేయడం వంటి వాటి మీద కూడా ఆయన రక్షణ తీసుకోనున్నాడు. ఇది అల్లు అర్జున్ ని ద్వేషించే వాళ్లకు షాకింగ్ న్యూస్ అనే చెప్పాలి. ఎందుకంటే సోషల్ మీడియా లో అల్లు అర్జున్ ఫోటోలను మార్ఫ్ చేస్తూ , వందల కొద్దీ పోస్టులను ఈమధ్య కాలం లో మనం చాలానే చూశాము. ఇక మీదట అలా చేయడానికి లేదు. చేస్తే అల్లు అర్జున్ పీఆర్ టీం కఠినమైన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. వాణిజ్య ప్రయోజనాలకు కూడా కేవలం అల్లు అర్జున్ అనుమతి ఉంటేనే ఆయన పేరు కానీ, ఫోటోలను కానీ వాడుకోవచ్చు.
గతం లో ఇలా ఐశ్వర్య రాయ్ , అభిషేక్ బచ్చన్, హృతిక్ రోషన్, ఎన్టీఆర్, నాగార్జున , చిరంజీవి వంటి వారు కూడా ఇదే పద్దతి ని అనుసరించారు. అయినప్పటికీ వీళ్ళ పై ట్రోల్స్ ఆగలేదు, వస్తూనే ఉన్నాయి. ఆ హీరోలకు సంబంధించిన పీఆర్ టీం సీరియస్ గా తీసుకొని పోలీస్ కంప్లైంట్ ఇస్తే చర్యలు తీసుకోవచ్చు కానీ , ప్రస్తుతానికి ఎవ్వరూ పట్టించుకోలేదు. కానీ అల్లు అర్జున్ పీఆర్ టీం చాలా స్ట్రాంగ్. సోషల్ మీడియా లో వైరల్ అయ్యేలా ట్రోల్స్ వేస్తే మాత్రం అల్లు అర్జున్ పీఆర్ టీం స్పందిస్తుంది , కేసులు నమోదు చేయిస్తుంది. కాబట్టి సోషల్ మీడియా లో వినోదం కోసం ఫ్యాన్ వార్స్ వంటివి చేయడం తగ్గించండి అంటూ సోషల్ మీడియా లో కొంతమంది విశ్లేషకులు కామెంట్స్ చేస్తున్నారు.
0
0
0
0
0
0
0