పవన్ కళ్యాణ్ ఆ దర్శకుడి విషయంలో క్లారిటీ గా ఉన్నాడుగా...

Pawan Kalyan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా వచ్చిన ప్రతి సినిమాలో ఏదో ఒక వైవిధ్యమైన కథంశమైతే ఉంటుంది. కెరియర్ స్టార్టింగ్ లోనే భారీ విజయాలను సాధించిన ఆయన ప్రస్తుతం చేస్తున్న సినిమాల విషయంలో సైతం చాలా కేర్ ఫుల్ గా వ్యవహరిస్తున్నాడు. ఇప్పటివరకు ఆయన చేసిన సినిమాలు అతన్ని టాప్ లెవల్లో నిల్చోబెట్టాయి. ఇక మీదట చేయబోతున్న సినిమాల విషయంలో సైతం ఆయన ఆచితూచి ముందుకు అడుగులు వేస్తున్నాడు. ప్రస్తుతం పవన్ కళ్యాణ్ ఇమేజ్ కి తగ్గ కథలను సెలెక్ట్ చేసే పనిని త్రివిక్రమ్ తీసుకున్నాడు. ఇప్పటికే ఇద్దరు ముగ్గురు దర్శకులు పవన్ కళ్యాణ్ కి కథలను వినిపించారు. కానీ సురేందర్ రెడ్డి చెప్పిన కథను మాత్రమే ఆయన ఫైనల్ చేసినట్టుగా తెలుస్తుంది. ఇక ఈ కథలో సురేందర్ రెడ్డి పవన్ కళ్యాణ్ ను చాలా డిఫరెంట్ గా ప్రజెంట్ చేయాలనే ప్రయత్నం చేస్తున్నాడట.
ఇక ఇప్పటివరకు సురేందర్ రెడ్డి చేసిన సినిమాలతో తన సత్తా చాటుకున్నాడు. కానీ గత కొద్దిరోజుల నుంచి ఆయన సరైన క్లారిటీ లేని సినిమాలను చేసి వెనుకబడి పోతున్నాడు. ముఖ్యంగా అఖిల్ తో చేసిన ‘ఏజెంట్’ సినిమా అతన్ని భారీగా దెబ్బ కొట్టింది. ఇక ఇప్పుడు చేస్తున్న ఈ సినిమా మీదనే ఆయన భారీ ఆశలైతే పెట్టుకున్నాడు. గతంలో ఎన్ని సక్సెస్ లు ఉన్నా కూడా ప్రస్తుతం మనకంటూ ఒక స్ట్రైచర్ ఉండాలి అంటే భారీ సక్సెస్ ని ఖాతాలో వేసుకోవాల్సిన అవసరమైతే ఉంది.
కాబట్టి సురేందర్ రెడ్డి అదే బాటలో ముందుకు నడుస్తున్నట్లుగా తెలుస్తుంది… సురేందర్ రెడ్డి విషయంలో పవన్ కళ్యాణ్ చాలా క్లారిటీగా ఉన్నాడట. కథ మొత్తాన్ని ఫైనల్ చేసి పెట్టిన పవన్ కళ్యాణ్ అందులో ఏమాత్రం చేంజెస్ చేయకుండా సినిమా చేయమని సురేందర్ రెడ్డి కి చెప్పారట. తనకు కావాల్సిన డేట్స్ ని పవన్ కళ్యాణ్ ఎలాగైనా సరే అడ్జస్ట్ చేసి ఇస్తానని కూడా చెప్పారట.
దాంతో సురేందర్ రెడ్డి సైతం చాలా హ్యాపీగా ఉన్నట్టుగా తెలుస్తుంది. ఈ సినిమాను తొందరలోనే సెట్స్ మీదకి తీసుకువెళ్లే అవకాశాలైతే ఉన్నాయి. ఇప్పటికే ఈ సంవత్సరం ‘ఉస్తాద్ భగత్ సింగ్’ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన పవన్ కళ్యాణ్ సురేందర్ రెడ్డి తో చేస్తున్న ఈ సినిమాని వచ్చే ఏడాది సమ్మర్ కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…
0
0
0
0
0
0
0