'డెకాయిట్' vs 'LIK'.. మొదటివారం వరల్డ్ వైడ్ వసూళ్లు.. అంచనాలు తారుమారు..

Dacoit movie collections : ఏప్రిల్ 10 న యూత్ ఆడియన్స్ లో మంచి క్రేజ్ ని సంపాదించుకున్న ‘డెకాయిట్'(Dacoit Movie), ‘LIK ‘ చిత్రాలు భారీ అంచనాల నడుమ విడుదలైన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలకు కూడా ఆడియన్స్ నుండి డివైడ్ టాక్ రావడం గమనార్హం. అయితే ‘డెకాయిట్’ చిత్రం కంటెంట్ కాస్త బెటర్ గా ఉండడం తో, వర్కింగ్ డేస్ లో LIK మీద డీసెంట్ స్థాయి హోల్డ్ ని కనబర్చుకొని ముందుకు వెళ్ళింది. రెండు సినిమాలు ఇప్పుడు వారం రోజుల థియేట్రికల్ రన్ ని పూర్తి చేసుకున్నాయి. ఈ రెండిట్లో ‘LIK ‘ చిత్రానికి టాక్ బాగాలేకపోయినప్పటికీ , గ్రాస్ పరంగా ‘డెకాయిట్’ మీద లీడ్ తీసుకుంది. అందుకు కారణం భారీ ఓపెనింగ్స్ రావడం వల్లే. మరి ఈ రెండు సినిమాలకు ప్రాంతాల వారీగా ఎంత వసూళ్లు వచ్చాయి చూద్దాం.
ముందుగా అడివి శేష్ డెకాయిట్ సినిమా విషయానికి వస్తే , ఈ చిత్రానికి 7 వ రోజున తెలుగు రాష్ట్రాల నుండి 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చినట్టు తెలుస్తోంది. ప్రాంతాల వారీగా మొదటి వారం రాబట్టిన వసూళ్లను ఒకసారి చూస్తే , నైజాం ప్రాంతం నుండి 6 కోట్ల 60 లక్షల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టిన ఈ సినిమాకు , సీడెడ్ నుండి 90 లక్షల రూపాయిలు , ఆంధ్ర ప్రాంతం నుండి 4 కోట్ల 26 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా మొదటి వారం తెలుగు రాష్ట్రాల నుండి 21 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 11 కోట్ల 76 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక + థిస్ ఆఫ్ ఇండియా నుండి 2 కోట్ల 26 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు రాగా , హిందీ నుండి 3 కోట్ల 50 లక్షలు, ఓవర్సీస్ నుండి 5 కోట్ల 65 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా వరల్డ్ వైడ్ గా 47 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 23 కోట్ల 17 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి. బ్రేక్ ఈవెన్ మార్కుకి మరో 7 కోట్ల 83 లక్షలు రావాలి.
ఇక LIK విషయానికి వస్తే ఒక్క తమిళనాడు ప్రాంతం నుండే ఈ చిత్రానికి వారం రోజుల్లో 26 కోట్ల 65 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, తెలుగు రాష్ట్రాల నుండి 7 కోట్ల 50 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. అదే విధంగా కర్ణాటక ప్రాంతం నుండి 3 కోట్ల 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగ, రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి 1 కోటి 15 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ నుండి అయితే ఏకంగా 10 కోట్ల 70 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, ఓవరాల్ వరల్డ్ వైడ్ గా తెలుగు + తమిళ భాషలకు కలిపి ఈ చిత్రానికి 49 కోట్ల 35 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు , 22 కోట్ల 35 లక్షల రూపాయిల షేర్ వసూళ్లు వచ్చాయి.
0
0
0
0
0
0
0