రజినీకాంత్ 'జైలర్ 2' సినిమాలో విలన్స్ గా కనిపించనున్న ఆ ఇద్దరు హీరోలు...

Rajinikanth Jailer 2: తమిళ్ సినిమా ఇండస్ట్రీలో సత్తా చాటుకున్న నటులు చాలా మంది ఉన్నారు. అందులో రజినీకాంత్ చాలా ప్రత్యేకమైన స్థానాన్ని సంపాదించుకున్నాడు. అతని సినిమాలను తెలుగులోకి కూడా డబ్ చేసి రిలీజ్ చేయడంతో ఇక్కడ కూడా ఆయనకి ఇక్కడ కూడా చాలా మంచి మార్కెట్ క్రియేట్ అయింది… ఇండియా వైడ్ గా భారీ పాపులారిటీని సంపాదించుకున్న రజినీకాంత్ 70 సంవత్సరాల పైబడిన వయసులో కూడా కుర్ర హీరోలకు పోటీని ఇస్తూ సినిమాలు చేస్తున్నాడు అంటే మామూలు విషయం కాదు. ప్రస్తుతం ఆయన నెల్సన్ డైరెక్షన్ లో ‘జైలర్ 2’ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే భారీ సక్సెస్ ను తన ఖాతాలో వేసుకోవాలి అనుకుంటున్నాడు. ఇక తను అనుకున్నట్టుగానే ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ని సాధిస్తుంది అనేది తెలియాలంటే మాత్రం సినిమా రిలీజ్ అయ్యేంతవరకు వెయిట్ చేయాల్సిందే. అయితే రజినీకాంత్ – నెల్సన్ కాంబినేషన్లో వచ్చిన జైలర్ మూవీ మొదటి పార్ట్ భారీ విజయాన్ని సాధించడంతో రెండో పార్ట్ మీద కూడా భారీ హైప్ క్రియేట్ అవుతుంది…
ఇక ఈ సినిమాలో ప్రస్తుతం విలన్స్ గా ఇద్దరు స్టార్ హీరోలు నటించబోతున్నారనే వార్తలైతే వస్తున్నాయి. అందులో ఒకరు ఎస్ జె సూర్య కాగా, మరొకరు కన్నడ స్టార్ హీరో ఉపేంద్ర కావడం విశేషం…అయితే ఇందులో ఉపేంద్ర కీలకమైన పాత్రలో నటిస్తున్నాడట. కానీ ఆ పాత్ర కి కొంచెం నెగిటివ్ షేడ్స్ కూడా ఉండబోతున్నట్టుగా తెలుస్తుంది. ఇక ఈ విషయాన్ని ఇప్పటివరకు సినిమా యూనిట్ ఎక్కడ కూడా లీకైతే చేయలేదు.
అత్యంత రహస్యంగా ఉంచుతున్న ఈ విషయం మీద తమిళ్ మీడియాలో కొన్ని కథనాలైతే వెలువాడుతున్నాయి. దాంతో ఉపేంద్ర ఈ సినిమాలో నటిస్తున్నాడనే వార్తలైతే వైరల్ అవుతున్నాయి. ఇక ఏది ఏమైనా కూడా ఉపేంద్ర హీరోగా రాణించాడు. అలాగే ఇప్పుడు విలన్ పాత్రలను చేస్తున్నాడు. ఉపేంద్ర సైతం డిఫరెంట్ క్యారెక్టర్స్ లో నటించడానికి ఆయన ముందు వరుసలో ఉంటాడు.
కాబట్టి తను కూడా ఈ సినిమా కోసం విపరీతంగా కష్టపడుతున్నట్టుగా తెలుస్తుంది. అయితే ఈ సినిమాలో రజనీకాంత్ హీరో అనే ఒకే ఒక్క కారణంతో ఉపేంద్ర కథ కూడా వినకుండా ఈ సినిమాలో నటిస్తున్నాడట… మరి ఈ సినిమా ఏ రేంజ్ సక్సెస్ ను సాధిస్తుంది అనేది తెలియాలంటే మరికొద్ది నెలల పాటు వెయిట్ చేయాల్సిన అవసరమైతే ఉంది.
0
0
0
0
0
0
0