Motorola కొత్త మొబైల్ మార్కెట్లోకి.. ఈ బ్యాంకు క్రెడిట్ కార్డుల పై కొనుగోలు చేస్తే రూ.2 వేలు సేఫ్..

Motorola Edge 70 Pro: ప్రముఖ మొబైల్ కంపెనీ Motorola నుంచి కొత్త ఫోన్ మార్కెట్లోకి వచ్చింది. ఇప్పటికే ఈ కంపెనీకి చెందిన ఎన్నో మొబైల్స్ ఆదరణ పొందాయి. అయితే వినియోగదారుల అభిరుచులు, అవసరాలను గుర్తించిన ఈ కంపెనీ లేటెస్ట్ గా Motorola Edge 70 Pro అనే మొబైల్ ను రిలీజ్ చేసింది. గతంలో వచ్చిన మొబైల్స్ కంటే ఇందులో అడ్వాన్స్ ఫీచర్స్ తో పాటు బ్యాటరీ వ్యవస్థ కూడా బలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా దీనిని క్రెడిట్ కార్డు ద్వారా కొనుగోలు చేస్తే రూ. 2 వేల వరకు ఆర్థిక ప్రయోజనాలు పొందే అవకాశం ఉంది. ఇంతకీ ఈ మొబైల్ ఎలా ఉందో చూద్దాం..
Edge 70 Pro మొబైల్ లో 6.8 అంగుళాల సూపర్ HD AMOLED డిస్ప్లే కనిపిస్తుంది. ఈ డిస్ప్లే 144 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేస్తుంది. అలాగే 5200 nits బ్రైట్నెస్తో పనిచేసే ఈ మొబైల్ లో IP 68, IP 69 రేటింగ్ ఉండనుంది. దీంతో ఈ మొబైల్ లో మూవీస్ చూసేవారికి అనుకూలమైన డిస్ప్లే కనిపిస్తుంది. ఇది ఆండ్రాయిడ్ 16 తో కూడిన హెలొ యూఐ తో పనిచేస్తుంది. మూడేళ్ల పాటు సెక్యూరిటీ అప్డేట్ ఇవ్వనున్న ఈ మొబైల్ లో కెమెరా పని తీరు మెరుగ్గా ఉన్నట్లు తెలుస్తోంది.
మోటోరోలా కొత్త మొబైల్ లో 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండండి. 50 ఎంపీ ఆల్రా వైడ్ యాంగిల్ తో పాటు 50 ఎంపీ ఫ్రంట్ కెమెరా తో పాటు వీడియో కాలింగ్ కోసం కూడా సౌకర్యంగా ఉండనుంది. దీంతో సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారితో పాటు నాణ్యమైన ఏఐ తరహాలో ఫోటోలు కావాలని అనుకునే వారికి ఈ కెమెరా అద్భుతంగా పనిచేస్తుంది. ఇందులో బ్యాటరీ వ్యవస్థ కూడా బలంగానే ఉన్నట్లు తెలుస్తోంది. 6500 mAh బ్యాటరీ ఉండగా.. ఈ బ్యాటరీ 90 వాట్ పాస్ట్ చార్జింగ్తో పనిచేస్తుంది. రోజువారి వినియోగదారులకు ఇందులో ఉండే బ్యాటరీ నిల్వ బాగా ఉపయోగపడే అవకాశం ఉంది.
వీటితోపాటు ఇందులో వైఫై 6 ఈ, బ్లూటూత్ 5.4, యూఎస్బీ టైప్ సి వంటి సదుపాయాలు ఉన్నాయి. అయితే ప్రస్తుతం ఈ ఫోన్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. వీటిలో 8 జిబి రామ్ తో పాటు 256 జీబీ మొబైల్ ధర రూ.38,999 ఓ విక్రయిస్తున్నారు. అలాగే 12gb రామ్ కలిగిన ఫోన్ ధర రూ.41,999 తో విక్రయిస్తున్నారు. ఈ మొబైల్ లో హెచ్డిఎఫ్సి, యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుల ద్వారా కొనుగోలు చేస్తే రూ.2 వేల వరకు డిస్కౌంట్ పొందే అవకాశం ఉంటుంది. అలాగే మరో రూ.2 వేలు ఎక్స్చేంజ్ బోనస్ కింద పొందవచ్చు.
0
0
0
0
0
0
0