Ajit Agarkar: సంచలన నిర్ణయం తీసుకున్న బీసీసీఐ.. 2027 వరల్డ్ కప్ వరకు టీమిండియా ఆటగాళ్ల భవిష్యత్తు నిర్ణయించేది ఆయనే!

Ajit Agarkar: భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) ఒక కీలక నిర్ణయం దిశగా అడుగులు వేస్తోంది. టీమిండియా చిఫ్ సెలెక్టర్‌గా అజిత్ అగార్కర్ పదవీకాలాన్ని పొడిగించేందుకు బోర్డు మొగ్గు చూపుతోంది. ప్రస్తుతం ఉన్న సమాచారం ప్రకారం.. 2027లో జరగనున్న ఐసీసీ వన్డే ప్రపంచ కప్ వరకు అగార్కర్‌నే ఆ పదవిలో కొనసాగించాలని బిసిసిఐ భావిస్తోందని సమాచారం. అజిత్ అగార్కర్ హయాంలో టీమిండియా అద్భుతమైన విజయాలను నమోదు చేసింది. ఆయన ఎంపిక చేసిన జట్లు వరుసగా ఐసీసీ టైటిళ్లను ముద్దాడటంతో బోర్డు ఆయనపై పూర్తి నమ్మకంతో బీసీసీఐ ఉంది.
ఆయన హయాంలో ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2024 విజేతగా భారత్ నిలిచింది. అలాగే ఐసీసీ ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ను కూడా కైవసం చేసకుంది. ఐసీసీ టీ20 ప్రపంచ కప్ 2026 విజేతగా నిలవడంలో అగార్కర్ ఎంపిక విధానం కీలకంగా మారింది. వీటితో పాటు 2023 వన్డే ప్రపంచ కప్‌లోనూ భారత్ ఫైనల్ వరకు చేరిన సంగతి తెలిసిందే.
సాహసోపేత నిర్ణయాలు.. యువతకు పెద్దపీట
అగార్కర్ చీఫ్ సెలెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత జట్టులో మార్పులు సజావుగా సాగాయి. సీనియర్ ఆటగాళ్లకు గౌరవం ఇస్తూనే, యువ ఆటగాళ్లను ప్రోత్సహించడంలో ఆయన సక్సెస్ అయ్యారు. జట్టులో ఫియర్ లెస్ అప్రోచ్‌ను నింపేందుకు ఆయన తీసుకున్న సాహసోపేతమైన నిర్ణయాలు భారత్‌ను ప్రపంచ నంబర్ వన్ జట్టుగా నిలబెట్టాయని బీసీసీఐ వర్గాలు వెల్లడించాయి. అగార్కర్ ప్రస్తుత ఒప్పందం 2026 జూన్‌తో ముగియనుంది. అయితే వచ్చే ఏడాది జరగనున్న వన్డే ప్రపంచ కప్ దృష్ట్యా, జట్టులో నిలకడను దెబ్బతీయకూడదని బోర్డు భావిస్తోంది. అగార్కర్ నాయకత్వంలోని సెలెక్షన్ కమిటీకి మరో రెండేళ్ల పాటు బాధ్యతలు అప్పగించడం ద్వారా 2027 వరల్డ్ కప్ లక్ష్యాన్ని సులువుగా చేరుకోవచ్చని బీసీసీఐ ప్లాన్ చేస్తోంది. జూలై 2023లో బాధ్యతలు చేపట్టిన అగార్కర్, అటు ఆటగాడిగా ఇటు సెలెక్టర్‌గా తనదైన ముద్ర వేశారు. ఒకవేళ ఈ పొడిగింపు అధికారికమైతే, భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన, సుదీర్ఘ కాలం కొనసాగిన చీఫ్ సెలెక్టర్లలో ఒకరిగా అగార్కర్ నిలుస్తారు.
READ ALSO: Israel: చైనా, పాకిస్థాన్ ఇజ్జత్ తీసిన ఇజ్రాయెల్.. ఇరాన్‌కు ఎంత ‘చెక్కు’ ఇచ్చారని సూటి ప్రశ్న!
0
0
0
0
0
0
0