KKR vs RR: టాస్ గెలిచిన రాజస్థాన్.. కోల్‌కతా ఈరోజైనా ఖాతా తెరిచేనా?..

కోల్‌కతా నైట్ రైడర్స్, రాజస్థాన్ రాయల్స్ జట్లు ఈడెన్ గార్డెన్స్‌లో మరికాసేపట్లో తలపడనున్నాయి. ఈ మ్యాచ్ కోసం అంతా సిద్ధమైంది. ఈడెన్ గార్డెన్స్‌లో మ్యాచ్ జరగనుంది ఈ మ్యాచ్ లో భాగంగా రాజస్థాన్ రాయల్స్ టాస్ గెలిచి, మొదట బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో కోల్ కతా ఫీల్డింగ్ చేయనుంది. కోల్‌కతా ఇప్పటివరకు ఆరు మ్యాచ్‌లు ఆడి ఐదింటిలో ఓడిపోయింది. వర్షం కారణంగా ఒక మ్యాచ్ రద్దయింది. దీంతో కోల్ కతా మొదటి విజయం కోసం ఎదురుచూస్తోంది. రాజస్థాన్ రాయల్స్ గత మ్యాచ్‌లో ఓటమి చవిచూసింది. తిరిగి విజయాల బాట పట్టాలని చూస్తోంది.
ఇరుజట్ల ముఖాముఖి రికార్డు విషయానికి వస్తే, కోల్‌కతాదే పైచేయి. 32 మ్యాచ్‌లు ఆడగా, కోల్‌కతా 16 గెలిచింది. రాజస్థాన్ 14 గెలవగా, రెండు మ్యాచ్‌లు ఫలితం లేకుండా ముగిశాయి. వైభవ్ సూర్యవంశీ గురించి ప్రస్తావించకుండా రాజస్థాన్ మ్యాచ్ జరగదు. మరోసారి, అందరి దృష్టి ఈ యువ బ్యాట్స్‌మన్‌పైనే ఉంటుంది. కోల్‌కతా బౌలింగ్ ఇప్పటికే బలహీనంగా ఉంది, ఈ విషయాన్ని పరిగణనలోకి తీసుకుంటే, వైభవ్ ఈరోజు మరోసారి బౌలర్లపై విరుచుకుపడవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
రాజస్థాన్ రాయల్స్ ప్లేయింగ్ XI: యశస్వి జైస్వాల్, వైభవ్ సూర్యవంశీ, ధ్రువ్ జురెల్ (WK), రియాన్ పరాగ్ (c), షిమ్రాన్ హెట్మెయర్, డోనోవన్ ఫెరీరా, రవీంద్ర జడేజా, జోఫ్రా ఆర్చర్, నాంద్రే బర్గర్, బ్రిజేష్ శర్మ, రవి బిష్ణోయ్
కోల్‌కతా నైట్ రైడర్స్ ప్లేయింగ్ XI: టిమ్ సీఫెర్ట్ (WK), అజింక్యా రహానే (c), కామెరాన్ గ్రీన్, రోవ్‌మన్ పావెల్, రింకు సింగ్, సునీల్ నరైన్, రమణదీప్ సింగ్, అనుకుల్ రాయ్, వైభవ్ అరోరా, కార్తీక్ త్యాగి, వరుణ్ చకరవర్తి
0
0
0
0
0
0
0