Kadiyam Srihari : తెలంగాణ ఏర్పాటును అడుగడుగునా బీజేపీ అవమానిస్తోంది

19, 2026 - 15:30
 0
Kadiyam Srihari : తెలంగాణ ఏర్పాటును అడుగడుగునా బీజేపీ అవమానిస్తోంది
Kadiyam Srihari Slams Bjp Over Telangana Formation

తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు , విభజన అంశంపై భారతీయ జనతా పార్టీ (బీజేపీ) అనుసరిస్తున్న తీరుపై మాజీ మంత్రి కడియం శ్రీహరి తీవ్రస్థాయిలో మండిపడ్డారు. తెలంగాణ ఏర్పాటును బీజేపీ నాయకత్వం అడుగడుగునా అవమానిస్తోందని, వారి నిజ స్వరూపం తెలంగాణకు వ్యతిరేకమని ఆయన ధ్వజమెత్తారు. శనివారం మీడియా సమావేశంలో మాట్లాడిన ఆయన, కేంద్ర ప్రభుత్వం , ప్రధాని మోదీ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ నిప్పులు చెరిగారు.

Diapers on Buffaloes: పిల్లలకే కాదు.. బర్రెలకు కూడా డైపర్స్.. ఎక్కడంటే.

తెలంగాణ విభజనను భారత్-పాకిస్తాన్ విడిపోవడంతో పోల్చడం అత్యంత దుర్మార్గమని కడియం శ్రీహరి వ్యాఖ్యానించారు. పార్లమెంట్ సాక్షిగా ఇటువంటి తెలివిలేని మాటలు మాట్లాడటం తెలంగాణ ప్రజల ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలు తెలంగాణ రాష్ట్ర ఏర్పాటునే బీజేపీ జీర్ణించుకోలేకపోతోందని, అందుకే అడుగడుగునా విషం చిమ్ముతున్నారని విమర్శించారు.

Parshuraam: హోంబలే సినిమాటిక్ యూనివర్స్ నుంచి..పరశురామ్ భారీ అనౌన్స్‌మెంట్!

కేంద్రంలో పదేళ్లకు పైగా అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి చేసిందేమీ లేదని కడియం శ్రీహరి ధ్వజమెత్తారు. గడిచిన 12 ఏళ్ల కాలంలో తెలంగాణకు ఒక్కటంటే ఒక్క జాతీయ ప్రాజెక్టు కూడా ఇవ్వలేదని, నిధుల కేటాయింపులోనూ తీవ్ర వివక్ష చూపుతున్నారని ఆరోపించారు. అభివృద్ధి గురించి మాట్లాడకుండా, కేవలం రాష్ట్ర విభజనపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే బీజేపీ పనిగా పెట్టుకుందని మండిపడ్డారు. తెలంగాణ ప్రజల ఆకాంక్షను, అనేక మంది బలిదానాలను కించపరిచేలా బీజేపీ నేతలు వ్యవహరిస్తున్నారని, దీనికి ప్రజలే బుద్ధి చెబుతారని ఆయన హెచ్చరించారు. బీజేపీ నిజంగా తెలంగాణకు అనుకూలమైతే ఇక్కడి ప్రాజెక్టులకు ఎందుకు నిధులు ఇవ్వడం లేదని ఆయన ప్రశ్నించారు.

0
0
0
0
0
0
0