రజినీకాంత్ విషయంలో ఆ ఇద్దరు దర్శకులు రాంగ్ గా ఆలోచించడానికి కారణం ఎవరు...

23, 2026 - 11:32
 0
రజినీకాంత్ విషయంలో ఆ ఇద్దరు దర్శకులు రాంగ్ గా ఆలోచించడానికి కారణం ఎవరు...
Rajinikanth

Rajinikanth: సూపర్ స్టార్ రజినీకాంత్ తో సినిమా చేయాలనే కల ప్రతి ఒక్కరికి ఉంటుంది. ఆయనతో అవకాశం వస్తే వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకోవచ్చని ప్రతి దర్శకుడు ఆరాటపడుతూ ఉంటాడు. కానీ రజనీకాంత్ మాత్రం కొందరికి మాత్రమే అవకాశాలను ఇస్తున్నాడు. ఇక అతను అవకాశం ఇచ్చిన దర్శకులలో కొందరు అతన్ని పూర్తిస్థాయిలో వాడుకోలేకపోయారు. దానివల్ల ప్లాప్ లను మూట గట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ముఖ్యంగా తమిళ్ దర్శకుడు అయిన పా. రంజిత్ కి రజనీకాంత్ రెండు సార్లు సినిమా చేసే అవకాశాన్ని ఇచ్చాడు. అందులో ఒకటి కబాలి కాగా, మరొకటి కాలా మూవీ కావడం విశేషం…

ఈ రెండు సినిమాలు ఆశించిన మేరకు విజయాన్ని సాధించలేదు. రంజిత్ అనుకున్నది అనుకున్నట్టుగా తెరమీద ఆవిష్కరించలేకపోయాడు. అందుకే ఆ సినిమాలు ఆడలేదని కొందరు చెబుతుంటారు. నిజానికి రజనీకాంత్ ని పూర్తిస్థాయిలో వాడుకోవడంలో ఆయన పూర్తిగా ఫెయిల్ అయిపోయారు అంటూ చాలామంది చాలా విమర్శలు చేశారు…

రజనీకాంత్ లో ఉన్న ఎనర్జీ ని వాడుకొని అతన్ని నెక్స్ట్ లెవల్లో ప్రజెంట్ చేసినట్లయితే సినిమాలు సూపర్ సక్సెస్ గా నిలుస్తాయి అలా కాకుండా ఇష్టం వచ్చినట్టుగా తనతో సినిమాలు చేస్తే ప్రేక్షకులు అతన్ని స్వీకరించే అవకాశం అయితే లేకుండా పోయింది. రజినీకాంత్ అంటే ఒక స్వాగ్ తో ప్రేక్షకులందరిని ఆకట్టుకోగలిగే కెపాసిటి ఉన్న హీరో… అలాంటి హీరోని స్క్రీన్ మీద హై ఎనర్జీతో ప్రజెంట్ చేసినప్పుడు మాత్రమే వాళ్లకు సక్సెసులు వరిస్తాయి…

ఇక లోకేష్ కనకరాజు సైతం కూలీ సినిమాతో రజనీకాంత్ ను డిఫరెంట్ యాంగిల్ లో ప్రజెంట్ చేసి ప్రేక్షకులను మెప్పించడానికి ప్రయత్నం చేసిన కూడా కూలీ మూవీ ఆశించిన మేరకు సక్సెస్ సాధించలేదు. దాంతో రజనీకాంత్ మార్కెట్ అనేది భారీగా పడిపోయింది. ఇక లోకేష్ సైతం డైరెక్షన్ లో ఏ మాత్రం వైవిధ్యాన్ని చూపించలేకపోయాడు… మొత్తానికైతే రజినీకాంత్ ను ఈ ఇద్దరు స్టార్ డైరెక్టర్స్ అంత ఎఫెక్టివ్ గా చూపించలేకపోయారనేది వాస్తవం…

0
0
0
0
0
0
0