ముంబై ఇండియన్స్ పై ఒకే ఒక్కడు.. ఎవరికీ అందనంత ఎత్తులో విరాట్ కోహ్లీ

13, 2026 - 12:01
 0
ముంబై ఇండియన్స్ పై ఒకే ఒక్కడు.. ఎవరికీ అందనంత ఎత్తులో విరాట్ కోహ్లీ
Virat Kohli Records Vs Mumbai Indians 2026

Virat Kohli Records Vs Mumbai Indians 2026: విరాట్ కోహ్లీ అంటేనే విధ్వంసానికి మారుపేరు. బీభత్సమైన బ్యాటింగ్.. రౌద్రమైన ఇన్నింగ్స్.. వంటి ఉపమానాలకు అతడు పెట్టింది పేరు. వయసు పెరుగుతున్న కొద్దీ అతడిలో ఇంకా ఊపు ఎక్కువ అవుతోంది. అతనితో క్రికెట్ మొదలు పెట్టిన ప్లేయర్లు ఇప్పటికే రిటైర్మెంట్ ప్రకటించారు. కొందరు ఆడుతున్నప్పటికీ ఆ స్థాయిలో కాదు. కానీ విరాట్ ఇప్పటికీ అదే స్థాయిలో సామర్థ్యాన్ని కొనసాగిస్తున్నాడు. విధ్వంసానికి మారుపేరుగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అందువల్లే విరాట్ కోహ్లీని పరుగుల యంత్రం అని పిలుస్తున్నారు.

ముంబై ఇండియన్స్ జట్టుతో ఆదివారం జరిగిన మ్యాచ్లో విరాట్ కోహ్లీ హాఫ్ సెంచరీ చేశాడు. 38 బంతులు ఎదుర్కొన్న అతడు.. 50 పరుగులు చేశాడు. ఫలితంగా ముంబై ఇండియన్స్ జట్టు మీద 1000 పరుగులు చేసిన ఆటగాడిగా నిలిచాడు. 36 ఇన్నింగ్స్ లలో విరాట్ కోహ్లీ ఈ ఘనత అందుకున్నాడు. అంతే కాదు, ఢిల్లీ ఆటగాడు కేఎల్ రాహుల్ ఘనతను అధిగమించాడు. ముంబై ఇండియన్స్ జట్టుపై రాహుల్ 21 ఇన్నింగ్స్ లలో 977 పరుగులు చేశాడు. విరాట్, కేఎల్ రాహుల్ కు దరిదాపుల్లో ఏ ఆటగాడు కూడా లేడు. విరాట్ కోహ్లీ 1003, కేఎల్ రాహుల్ 977, శిఖర్ ధావన్ 28 ఇన్నింగ్స్ లలో 901, రహానే 29 ఇన్నింగ్స్లలో 888, సురేష్ రైనా 36 ఇన్నింగ్స్ లలో 850 పరుగులు చేశారు.

ఇది మాత్రమే కాకుండా చెన్నై జట్టుపై 1,188 పరుగులు చేసిన ఆటగాడిగా విరాట్ నిలిచాడు. అంతేకాదు కోల్ కతా నైట్ రైడర్స్ జట్టుమీద రోహిత్ శర్మ 1,161 చేసిన పరుగుల రికార్డును బద్దలు కొట్టాడు. ఇక ఐపీఎల్ చరిత్రలో హైయెస్ట్ రన్స్ కొట్టిన ఆటగాడిగా విరాట్ కోహ్లీ కొనసాగుతున్నాడు. 263 ఇన్నింగ్స్ లలో 8814 పరుగులు చేశాడు విరాట్. అతడికి దరిదాపుల్లో ఏ ఆటగాడు కూడా లేకపోవడం విశేషం. ఇక ఈ సీజన్లో మరో రెండు వందల పరుగులు గనుక చేస్తే విరాట్ కోహ్లీ 9వేల పరుగుల మైలురాయి అధిగమిస్తాడు. మొత్తం గా t20 లలో 13,500 పరుగులు చేశాడు కోహ్లీ. గేల్ సృష్టించిన రికార్డుకు ఇంకా వెయ్యి పరుగుల దూరంలో ఉన్నాడు. ఈ సీజన్ , వచ్చే సీజన్ లో సత్తా చూపిస్తే విరాట్ కచ్చితంగా గేల్ రికార్డు బద్దలు కొట్టడమే కాదు.. సరికొత్త ఆటగాడిగా ఆవిర్భవిస్తాడు.

విరాట్ ప్రస్తుతం సూపర్ ఫామ్ లో ఉన్నాడు. బెంగళూరు జుట్టు తరఫున వరుస హాఫ్ సెంచరీలు చేసి అదరగొడుతున్నాడు. ఆ జట్టు సాధిస్తున్న విజయాలలో ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. ఓపెనర్ గా వస్తున్న అతడు ఏ మాత్రం వెనకడుగు వేయడం లేదు. తన మీద ఉన్న అంచనాలను ఏమాత్రం వమ్ము చేయడం లేదు. అందువల్లే బెంగళూరు ప్రతి మ్యాచ్లో భారీ స్కోరు చేయగలుగుతుంది. విరాట్ కు సాల్ట్ తోడు కావడంతో బెంగళూరు తొలి వికెట్ కు మెరుగైన భాగస్వామ్యాలు ఏర్పడుతున్నాయి.

0
0
0
0
0
0
0