Mega158: మెగాస్టార్ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో?

19, 2026 - 12:32
 0
Mega158: మెగాస్టార్ సినిమాలో బాలీవుడ్ సీనియర్ హీరో?
Megastar Chiranjeevi Bobby Mega158 Anil Kapoor Special Role Update

మెగాస్టార్ చిరంజీవి – బాబీ కొల్లి కాంబోలో #Mega158 (వర్కింగ్ టైటిల్) సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. KVN ప్రొడక్షన్స్ బ్యానర్‌పై వెంకట్ కె నారాయణ నిర్మిస్తున్న ఈ చిత్రానికి థమన్ సంగీతం అందిస్తుండగా, నిమిష్ రవి సినిమాటోగ్రాఫర్‌గా వ్యవహరిస్తున్నారు. నిజానికి ఈ సినిమా లాంచ్ ఏప్రిల్ 11న జరగాల్సి ఉండగా, అదే ప్రొడక్షన్ హౌస్ నిర్మిస్తున్న ‘జన నాయగన్’ (Jana Nayagan) లీక్ ఇష్యూ వల్ల లాంచ్ ప్రోగ్రాం కాస్త వాయిదా పడింది. త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ ప్రారంభం కానుంది. అయితే ఈ మూవీ గురించి రోజుకో ఆసక్తికరమైన వార్త బయటకు వస్తోంది. తాజాగా ఈ సినిమాలో ఒక పవర్‌ఫుల్ క్యామియో రోల్ ఉండబోతుందని, అది సినిమాకే హైలైట్‌గా నిలుస్తుందని సమాచారం. కాగా ఈ పాత్ర కోసం..

Also Read : Lenin: అఖిల్ ‘లెనిన్’ కోసం రంగంలోకి నాగార్జున.. ఫైనల్ కట్‌లో మార్పులు?

ఫిల్మ్ నగర్ టాక్ ప్రకారం.. ఈ చిత్రంలోని ఒక కీలక పాత్ర కోసం బాలీవుడ్ సీనియర్ స్టార్ హీరో అనిల్ కపూర్‌ను సంప్రదించినట్లు తెలుస్తోంది. ఈ పాత్ర కేవలం క్లైమాక్స్ సమయంలో వస్తుందని, కథను మలుపు తిప్పే విధంగా ఉంటుందని సమాచారం. చిరంజీవి, అనిల్ కపూర్ ఇద్దరూ మంచి స్నేహితులు కావడంతో, మెగాస్టార్ అడగగానే ఆయన వెంటనే గ్రీన్ సిగ్నల్ ఇచ్చే అవకాశం ఉందని అభిమానులు భావిస్తున్నారు. ఇక దర్శకుడు బాబీ ఈసారి కేవలం మాస్ మాత్రమే కాకుండా, స్ట్రాంగ్ ఫ్యామిలీ ఎమోషన్స్‌తో కథను సిద్ధం చేశారట. సెకండ్ హాఫ్‌లో వచ్చే ఫ్లాష్ బ్యాక్ కోసం చిరంజీవి సరికొత్త లుక్‌లో కనిపించబోతున్నారు. దీని కోసం ఆయన ప్రత్యేకంగా మేకోవర్ అవుతున్నట్లు తెలుస్తోంది. ఇది ఇంటెన్స్ ఎమోషనల్ బ్యాక్‌డ్రాప్‌తో కూడిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా అని సమాచారం.

0
0
0
0
0
0
0