వేగంతో పాటు వివేకం.. "ఆయా షేర్" అభిషేక్ శర్మ.. కానీ అది మిస్ అయింది

Abhishek Sharma IPL Century: వేగంగా ఆడుతాడు. కానీ వివేకాన్ని ప్రదర్శించడు. దూకుడుగా ఆడతాడు గాని.. బంతి గమనాన్ని అంచనా వేయలేడు. అందుకే అతని ఆటను సముద్రపు కెరటంతో పోల్చుతుంటారు. సముద్రపు కెరటం పడుతూ లేస్తూ సాగుతూ ఉంటుంది. అభిషేక్ శర్మ ఆట తీరు కూడా అలానే ఉంటుంది. కానీ, అభిషేక్ శర్మ ఆట ఇప్పుడు మారినట్టు కనిపిస్తోంది.
ఐపీఎల్ లో చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్ కంటే ముందు అభిషేక్ శర్మ అంతస్థిరంగా ఇన్నింగ్స్ ఆడలేకపోయాడు. అయితేనేమో కొట్టుడు.. లేకుంటేనేమో అవుట్ అవ్వుడు అన్నట్టుగా అతడి ఆట తీరు సాగిపోయింది. చెన్నై జట్టుతో జరిగిన మ్యాచ్లో అతడు మెరుపు హాఫ్ సెంచరీ చేశాడు. తర్వాత ఢిల్లీ జట్టుతో జరిగిన మ్యాచ్లో ఏకంగా సెంచరీ సాధించాడు. అంతేకాదు ప్రారంభం నుంచి చివరి వరకు అదే దూకుడు కొనసాగించాడు. ఫలితంగా 68 బంతులలో 10 ఫోర్లు, పది సిక్సర్ల సహాయంతో 135* పరుగులు చేశాడు.. వాస్తవానికి అభిషేక్ శర్మ ఇలా ఆడతాడని.. ఇలా నిలబడతాడని ఏ అభిమాని కూడా ఊహించలేదు. చివరికి హైదరాబాద్ జట్టు యజమాని కావ్య కూడా అంచనా వేసి ఉండదు.
తొలిసారిగా ఈ సీజన్లో హైదరాబాద్ జట్టు ఆటగాళ్లు ప్రతి వికెట్ కు 50 కి పైగా పరుగుల భాగస్వామ్యాలను నెలకొల్పారు. అభిషేక్ శర్మ గట్టిగా నిలబడటం వల్ల ఇది సాధ్యమైందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు. వాస్తవానికి అభిషేక్ శర్మ స్థిరంగా నిలబడితే హైదరాబాద్ జట్టు స్కోరు వేరే విధంగా ఉంటుంది. ఎందుకంటే అతడు ఒక్కసారి టాప్ గేర్ లోకి వస్తే ఆట తీరు పూర్తిగా మారిపోతుంది. ఫోర్ల కంటే సిక్సర్లు అధికంగా వస్తుంటాయి. బౌలర్ ఎవరైనా సరే పరుగులు ప్రవాహం లాగా సాగిపోతూ ఉంటాయి. అందువల్లే అభిషేక్ శర్మ నిలబడాలి.. అతడు గట్టిగా కలబడాలి.. ఇప్పుడే స్కోర్ వేగం రాకెట్ తో సమానంగా దూసుకెళ్తుంది అంటారు హైదరాబాద్ అభిమానులు.
0
0
0
0
0
0
0