మొన్న 'ఉస్తాద్ భగత్ సింగ్' ..నేడు 'ఆదర్శ కుటుంబం'.. తమన్ కి అన్నీ అలా కలిసొచ్చేస్తున్నాయ్..

Thaman success streak: ఒక సినిమాకు మ్యూజిక్ డైరెక్టర్ ని ఒకరిని ఎంచుకోవడం , ఆ తర్వాత వాళ్ళు తప్పుకోవడం, ఆ తర్వాత అది తమన్(SS Thaman) చేతుల్లోకి వెళ్లడం ఈమధ్య కాలం లో సర్వ సాధారణం అయిపోయింది. 2024 వ సంవత్సరం లో పాన్ ఇండియన్ సెన్సేషనల్ హిట్ ‘పుష్ప 2’ విషయం లో కూడా ఇదే జరిగింది. దేవిశ్రీ ప్రసాద్ పాటలు అందించాడు , కానీ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ చెప్పిన సమయానికి దేవి శ్రీ ప్రసాద్ అందించలేకపోవడం తో , తమన్ ని తీసుకోవాల్సి వచ్చింది. ఇక రీసెంట్ గా విడుదలైన ‘ఉస్తాద్ భగత్ సింగ్’ విషయం లో కూడా ఇదే జరిగింది. పాటలు దేవిశ్రీ ప్రసాద్ అందించగా , బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ సరైన సమయానికి దేవిశ్రీ అందించకపోవడం వల్ల, తమన్ ని తీసుకున్నారు. ఇప్పుడు రీసెంట్ గా వెంకటేష్ , త్రివిక్రమ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న ‘ఆదర్శ కుటుంబం’ చిత్రానికి కూడా అదే పరిస్థితి.
ముందుగా ఈ చిత్రానికి సంగీత దర్శకుడిగా హర్షవర్ధన్ రామేశ్వర్ ని ఎంచుకున్నారు. కానీ ఆయన ట్యూన్స్ ఎందుకో త్రివిక్రమ్ శ్రీనివాస్ కి నచ్చడం లేదు, పైగా డెలివరీ ఇవ్వడానికి కూడా చాలా సమయం తీసుకుంటున్నాడు. అందుకే హర్షవర్ధన్ ని ఈ చిత్రం నుండి తప్పించి , తమన్ ని ఎంచుకున్నారు. ఇప్పుడు తమన్ తో త్రివిక్రమ్ శ్రీనివాస్ ఫ్రెష్ గా మ్యూజిక్ సిట్టింగ్స్ వేసాడట. గతం లో కూడా త్రివిక్రమ్ శ్రీనివాస్ కి ఇలాంటి పరిస్థితే వచ్చింది. ఎన్టీఆర్ ‘అరవింద సమేత ‘ చిత్రం కోసం అనిరుద్ ని మ్యూజిక్ డైరెక్టర్ గా ఎంచుకున్నాడు త్రివిక్రమ్. కానీ అనిరుద్ కాల్ షీట్స్ ఫుల్ బిజీ గా ఉండడం , సమయానికి ట్యూన్స్ అందించే పరిస్థితి లేకపోవడం తో ఆయన్ని తప్పించి తమన్ ని ఎంచుకున్నాడు.
తమన్ ఆ చిత్రానికి ఎంత గొప్ప మ్యూజిక్ ని అందించాడో ప్రత్యేకించి చెప్పనవసరం లేదు. థియేటర్స్ లో కూర్చున్న ఆడియన్స్ కి తన అద్భుతమైన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో గూస్ బంప్స్ రప్పించేలా చేసాడు తమన్. ఆ చిత్రం అంత పెద్ద సక్సెస్ అవ్వడానికి తమన్ మ్యూజిక్ ప్రధాన కారణం అని చెప్పడం లో ఎలాంటి సందేహం లేదు. ఇక ‘ఆదర్శ కుటుంబం’ విషయానికి వస్తే, ఈ సినిమా షూటింగ్ ని జులై చివర్లో పూర్తి చేసి, దసరా కానుకగా ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఈ చిత్రం లో శ్రద్ద శ్రీనాథ్ హీరోయిన్ గా నటిస్తోంది. ఇక ప్రముఖ యంగ్ హీరో నారా రోహిత్ నెగెటివ్ షేడ్స్ ఉన్న పోలీస్ ఆఫీసర్ క్యారెక్టర్ లో కనిపించబోతున్నాడు.
0
0
0
0
0
0
0