ట్రంప్‌ కొవ్వెక్కిన మాటలు.. భారతీయులపై అక్కసు!

23, 2026 - 17:32
 0
ట్రంప్‌ కొవ్వెక్కిన మాటలు.. భారతీయులపై అక్కసు!
Donald Trump remarks on Indians

Donald Trump remarks on Indians: ఒకవైపు పశ్చిమాసియా యుద్ధం జరుగుతోంది. ఇరాన్‌–అమెరికా మధ్య శాంతి చర్చలు కొలిక్కి రాలేదు. 50 రోజులైనా అమెరికాకు ఇరాన్‌ లొంగలేదు. దీంతో అకారణంగా యుద్ధం మొదలు పెట్టిన ట్రంప్‌ పరువు హర్మూజ్‌లో కలిసేలా ఉంది. ఇలాంటి పరిస్థితిలో యుద్ధం నుంచి ఎలా బయటపడాలో తెలియక తంటాలు పడుతున్న ట్రంప్‌.. భారత్, చైనాపై అక్కసు వెల్లగక్కారు. యుద్ధం గెలవడం చేతగాక, కొవ్వెక్కిన మాటలు మాట్లాడాడు. భారతీయులు, చైనీయులు ’ల్యాప్‌టాప్‌’ పట్టుకుని అమెరికా వస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దేశాలను ’నరకకూపాలు’గా పిలిచిన రేడియో వ్యాఖ్యాత పోస్ట్‌ను రీపోస్ట్‌ చేసి, వలసదారులపై అసహనం చూపారు. అమెరికా రాజ్యాంగం 14వ సవరణ పౌరసత్వ నిబంధన మార్చలేని పరిస్థితిలో ఉందని పేర్కొన్నారు.

భారత్, చైనా నరకకూపాలు..
ట్రంప్‌ రీపోస్ట్‌లో, భారతీయులు, చైనీయులు ‘బర్త్‌ టూరిజం’ ద్వారా పిల్లలను కలిగి పౌరసత్వం పొంది.. కుటుంబాలను సైతం అమెరికాకు తీసుకువస్తున్నారని అసహనం వ్యక్తం చేశారు. ఐటీ నిపుణులను ’ల్యాప్‌టాప్‌ గ్యాంగ్‌స్టర్లు’గా పిలిచారు. ఒక్కరు అమెరికాకు వచ్చి తర్వాత కుటుంబం మొత్తాన్ని తీసుకువచ్చి ఇక్కడే తిష్టవేస్తున్నారని పేర్కొన్నాడు.

పౌరసత్వ సవరణ అసాధ్యం..
అమెరికా రాజ్యాంగం ప్రకారం దేశంలో జన్మించినవారికి స్వయంచాలక పౌరసత్వం ఇవ్వాలి. ఈ 14వ సవరణ మార్చడం సుప్రీం కోర్టు, కాంగ్రెస్‌ ఆమోదం అవసరం. ట్రంప్‌ ఒక్కరు చేయలేరు. ఈ అడ్డంకి వలస విధానాలను మరింత కఠినతరం చేస్తోందని మండిపడ్డారు. సొంత రాజ్యాంగాన్నే ట్రంప్‌ తప్పు పట్టారు.

హెచ్‌–1బీ వీసా ఫీజు లక్ష డాలర్లకు పెంచడంతో పిటిషన్లు 87 శాతం తగ్గాయి. భారతీయులు 71 శాతం పొందేవి. 7.25 లక్షల అక్రమ వలసదారుల్లో 18 వేల మంది భారతీయులు బహిష్కరణ జాబితాలో ఉన్నారు. టీసీఎస్, ఇన్‌ఫోసిస్‌ వంటి ఐటీ కంపెనీలు అదనపు ఖర్చులు ఎదుర్కొంటున్నాయి.

0
0
0
0
0
0
0