మొత్తానికి రిలీజ్ అయిన Vivo T5 Pro.. కొత్త ఫోన్ ఎలా ఉందో తెలుసుకోండి..

17, 2026 - 22:32
 0
మొత్తానికి రిలీజ్ అయిన  Vivo T5 Pro..  కొత్త ఫోన్ ఎలా ఉందో తెలుసుకోండి..
Vivo T5 Pro 5G

Vivo T5 Pro 5G: భారతదేశంలో Vivo ఫోన్లకు ప్రత్యేక గుర్తింపు ఉంటుంది. ఈ కంపెనీ నుంచి రిలీజ్ అయిన ఎన్నో మోడల్స్ కు ఆదరణ లభించింది. దీనిని దృష్టిలో ఉంచుకొని వినియోగదారులను ఆకర్షించేందుకు ఈ కంపెనీ ఎప్పటికప్పుడు అప్డేట్ చేసిన ఫోన్లను మార్కెట్లోకి తీసుకువస్తుంది. అయితే ఈ కంపెనీకి చెందిన Vivo T 5 Pro 5G మొబైల్ ఎప్పుడు మార్కెట్లోకి వస్తుందా? అని చాలా మంది ఎదురుచూశారు.మొత్తానికిక దీనిని రిలీజ్ చేశారు. ఇందులో డిస్ప్లే తోపాటు కెమెరా, బ్యాటరీ సామర్థ్యం ప్రత్యేకంగా ఉన్నట్లు పేర్కొంటుంది. దీంతో ఇది మల్టీ టాస్కింగ్ యూజర్స్ కు బాగా ఉపయోగపడుతుందని కంపెనీ ప్రతినిధులు తెలుపుతున్నారు. అలాగే ఇందులో ఉండే ఫీచర్స్ వినియోగదారులను ఆకట్టుకుంటాయని అంటున్నారు. మరి ఈ మొబైల్ గురించి పూర్తి వివరాల్లోకి వెళ్తే..

Vivo T5 మొబైల్ లో 6.83 అంగుళాల AMOLED డిస్ప్లే చూడవచ్చు. ఇది 1.5 k Resolution తో పనిచేస్తుంది. 144 Hz రిఫ్రెష్ రేట్ తో పనిచేసే ఈ డిస్ప్లేతో గేమింగ్ కోరుకునే వారికి సపోర్ట్ గా ఉంటుంది. అలాగే ఇందులో స్నాప్ డ్రాగన్ 7s జెన్ 4 ప్రాసెసర్ ను చేర్చారు. దీంతో మల్టీ టాస్కింగ్ కోసం యూస్ చేసే వారికి ఈ ప్రాసెసర్ ఉండడంతో వేగంగా తమ పనులను పూర్తి చేసుకోవచ్చు. పలు రకాల యాప్స్ ఇన్స్టాల్ చేసినా కూడా మొబైల్ వేగం తగ్గకుండా ఈ ప్రాసెసర్ పనిచేస్తుంది.

ఈ మొబైల్ లో కెమెరా పనితీరు అద్భుతంగా ఉన్నట్టు తెలుస్తోంది. ఇందులో 50 మెగాపిక్సల్ మెయిన్ కెమెరా ఉండనుంది. 8 ఎంపీ అల్ట్రా వైడ్ సెన్సార్ తో పనిచేస్తుంది. 32 ఎంపీ కెమెరాతో సెల్ఫీ లు, వీడియో కాలింగ్ కోసం ఉపయోగించుకోవచ్చు. సోషల్ మీడియా కంటెంట్ సృష్టించే వారితోపాటు తరచూ వీడియో కాలింగ్ చేసేవారికి ఈ మొబైల్ బాగా ఉపయోగపడుతుంది. అలాగే ఇందులో 9020 mAh బ్యాటరీని చేర్చారు. ఇది ఎక్కువ కాలం నిలువ ఉండే అవకాశం ఉంది. దీనికి ఫాస్ట్ చార్జింగ్ సపోర్టు ఉండడంతో తొందరగా చార్జింగ్ అయ్యే అవకాశం ఉంటుంది. వీటితోపాటు 5జి కనెక్టివిటీ, యూఎస్బీ పోర్టు వంటి ఫీచర్లు సౌకర్యాలను అందిస్తాయి. ఈ మొబైల్ ధర రూ.29,999 నుంచి ప్రారంభం అవుతుంది. ఆన్లైన్ ప్లాట్ఫారం ద్వారా దీనిని కొనుగోలు చేయవచ్చు. లేదా వివో రిటైల్ షాపుల ద్వారా కూడా కొనుగోలు చేసేందుకు అవకాశం ఇచ్చారు. త్వరలో అందుబాటులోకి రానున్న ఈ ఫోన్లపై ఆఫర్లను కూడా ప్రకటించే అవకాశం ఉందని తెలుస్తోంది.

0
0
0
0
0
0
0