మలేషియా లో పాణి పూరి అమ్ముతున్న నందమూరి బాలకృష్ణ.. సంచలనం రేపుతున్న వీడియో..

21, 2026 - 14:32
 0
మలేషియా లో పాణి పూరి అమ్ముతున్న నందమూరి బాలకృష్ణ.. సంచలనం రేపుతున్న వీడియో..
Balakrishna Malaysia pani puri video

Balakrishna Malaysia pani puri video: బాలయ్య(Nandamuri Balakrishna) ఏంటి.. పాణి పూరి అమ్మడం ఏంటి.. అది కూడా మలేషియా లో.. ఆయనకేమి అవసరం అని మీరంతా హెడ్ లైన్ ని చూసి అనుకొనే ఉండుంటారు. కానీ పాణి పూరి అమ్ముతున్నది నిజమైన బాలయ్య కాదు, అచ్చు గుద్దినట్టు బాలయ్య పోలికలతో ఉన్న ఒక వ్యక్తి. మనుషులను పోలిన మనుషులు ఈ ప్రపంచంలో 7 మంది ఉంటారని పెద్దలు అంటూ ఉంటారు. అది నిజమే అని ఇలాంటి సంఘటనలు చూసినప్పుడే అర్థం అవుతూ ఉంటుంది. ఈ క్రింది వీడియో ని ఒకసారి చూడండి , ప్రింట్ గుద్దినట్టు అతను బాలయ్య లాగానే ఉన్నాడు కదా. సోషల్ మీడియా కి దూరంగా ఉండే వాళ్ళు చూస్తే , ఇతన్ని నిజంగానే బాలయ్య అని అనుకునే ప్రమాదం ఉంది. ఒకవేళ రామ్ గోపాల్ వర్మ ఇతన్ని చూస్తే , అవసరం లేకపోయినా బాలయ్య బయోపిక్ తీసేస్తాడు.

టాలీవుడ్ లో హీరోలకు డూప్స్ ని వాడుకోవడం కొత్తేమి కాదు. రిస్కీ షాట్స్ ఉన్నప్పుడు , లేదంటే హీరో డేట్స్ అందుబాటులో లేనప్పుడు డూప్స్ తోనే కానిచ్చేస్తూ ఉంటారు డైరెక్టర్స్. ఒకవేళ బాలయ్య కి డూప్ గా ఎవరినో ఒకరిని తీసుకోవాలని మేకర్స్ అనుకుంటే, ఇతన్ని తీసుకోవడం బెస్ట్ అని అంటున్నారు నెటిజెన్స్. ఇక బాలయ్య సినిమాల విషయానికి వస్తే ‘అఖండ’ చిత్రం నుండి , ‘డాకు మహారాజ్’ వరకు వరుసగా బ్లాక్ బస్టర్ హిట్స్ ని అందుకుంటూ ముందుకు దూసుకెళ్తున్న బాలయ్య కి ‘అఖండ 2’ చిత్రం పెద్ద స్పీడ్ బ్రేకర్ లాగా నిల్చిన సంగతి అందరికీ తెలిసిందే. బోయపాటి శ్రీను దర్శకత్వం లో తెరకెక్కిన ఈ సినిమాకు దాదాపుగా 35 కోట్ల రూపాయలకు పైగా నష్టాలు వచ్చాయి. బాలయ్య – బోయపాటి కాంబినేషన్ అంటే , అసలు ఫెయిల్ అవ్వదు , కచ్చితంగా సూపర్ హిట్ అని ఆడియన్స్ బ్లైండ్ గా ఫిక్స్ అయిపోతారు. కానీ ఈసారి ఆడియన్స్ అంచనాలు తారుమారు అయ్యింది.

ఇకపోతే ఆయన తన తదుపరి చిత్రాన్ని గోపీచంద్ మలినేని తో చేస్తున్న సంగతి అందరికీ తెలిసిందే. గతంలో వీళ్లిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కిన ‘వీర సింహా రెడ్డి’ చిత్రం ఎంత పెద్ద బ్లాక్ బస్టర్ అయ్యిందో మన అందరికీ తెలిసిందే. మళ్లీ ఈ క్రేజీ కాంబినేషన్ నుండి సినిమా రాబోతుండడం తో అభిమానుల్లో , ప్రేక్షకుల్లో అంచనాలు భారీ రేంజ్ లో పెరిగాయి. ముందుగా పీరియడ్ జానర్ లో చిత్రాన్ని చేద్దామని అనుకున్నారు , కానీ బడ్జెట్ బాలయ్య రేంజ్ ని దాటిపోవడం తో , మామూలు కమర్షియల్ సబ్జెక్టు తోనే మన ముందుకు రాబోతున్నాడు. త్వరలోనే ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

 

View this post on Instagram

 

A post shared by Zindagi Media (@zindagi_media)

0
0
0
0
0
0
0