వైభవ్ సూర్య వంశీ కాదు.. అభిషేక్ అంతకంటే కాదు.. ఐపీఎల్ లో ఇతడే తోపు

21, 2026 - 19:02
 0
వైభవ్ సూర్య వంశీ కాదు.. అభిషేక్ అంతకంటే కాదు.. ఐపీఎల్ లో ఇతడే తోపు
IPL 2026 Highest Strike Rate Players

IPL 2026 Highest Strike Rate Players: ఇండియన్ ప్రీమియర్ లీగ్ ఈ సీజన్ అద్భుతంగా సాగుతోంది.. ఆటగాళ్లలో కొంతమంది అంచనాలకు మించి ఆకట్టుకుంటున్నారు. బ్యాట్ ద్వారా పరుగుల ప్రవాహాన్ని సాగిస్తున్నారు. ఇప్పటివరకు ఈ ఐపీఎల్లో ముగ్గురు ప్లేయర్లు సెంచరీలు చేశారు. అందులో సంజు శాంసన్ (చెన్నై సూపర్ కింగ్స్), డికాక్(ముంబై ఇండియన్స్), తిలక్ వర్మ (ముంబై ఇండియన్స్) ఉన్నారు. సెంచరీలు చేసినప్పటికీ.. వీరంతా స్థిరంగా ఆడలేక పోతున్నారు. దీంతో వీరి స్ట్రైక్ రేట్ తీవ్రంగా ప్రభావితమవుతోంది.

ఐపీఎల్ లో దూకుడుగా బ్యాటింగ్ చేసే బ్యాటర్ల జాబితాలో అభిషేక్ శర్మ ముందు వరుసలో ఉంటాడు. ఇక తాజా సంచలనం వైభవ్ సూర్య వంశీ కూడా అదే స్థాయిలో బ్యాటింగ్ చేస్తున్నాడు. ఇప్పటికే అతడు అనేక సందర్భాలలో మెరుపు ఇన్నింగ్స్ లు ఆడాడు. సన్ రైజర్స్ హైదరాబాద్ జట్టు తరపున క్లాసెన్ కూడా అద్భుతంగా ఆడుతున్నాడు. వరుస హాఫ్ సెంచరీలతో ఇతడు ఆరెంజ్ క్యాప్ హోల్డర్ గా మారిపోయాడు. విరాట్ కోహ్లీ కూడా భారీగానే పరుగులు చేస్తున్నాడు. అయితే వీరంతా ఒక ఎత్తు అయితే.. ఇతడు మాత్రం మరొక ఎత్తు.

ఐపీఎల్ 2026లో కనీసం 20 బంతులు ఆడిన బ్యాటర్లలో అత్యధిక స్ట్రైక్ రేట్ కలిగి ఉన్న ఆటగాడిగా పంజాబ్ ఓపెనర్ ప్రియాన్ష్ ఆర్య కొనసాగుతున్నాడు. అతడు ఇప్పటివరకు ఈ టోర్నీలో 85 బంతుల్లో 211 పరుగులు చేశాడు. స్ట్రైక్ రేట్ ఏకంగా 248.23 గా ఉంది. ఇతడి తర్వాత స్థానంలో 236.53 స్ట్రైక్ రేట్ తో వైభవ్ సూర్య వంశీ, 229.26 స్ట్రైక్ రేటుతో అభిషేక్ శర్మ, 212.96 స్ట్రైక్ రేటుతో రజత్ పాటి దార్, 203.52 స్ట్రైక్ రేట్ తో టీమ్ డేవిడ్ తర్వాతి స్థానాల్లో కొనసాగుతున్నారు.

ఈ సీజన్లో ఆర్య అదిరిపోయే రేంజ్ లో బ్యాటింగ్ చేస్తున్నాడు.. సిమ్రాన్ సింగ్ తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యాలను నిర్మిస్తున్నాడు. వీరిద్దరి దూకుడు వల్ల పంజాబ్ జట్టు తొలి వికెట్ కు రికార్డు స్థాయిలో భాగస్వామ్యాలను నెలకొల్పుతున్నది. అందువల్లే పంజాబ్ జట్టు ఓటమి అనేది లేకుండా దూసుకుపోతున్నది. ఆర్య అద్భుతంగా బ్యాటింగ్ చేస్తున్న నేపథ్యంలో.. భవిష్యత్తు కాలంలో అతడు టీమిండియాలో చోటు సంపాదించుకునే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు చెబుతున్నారు.

0
0
0
0
0
0
0