ఏపీకి బిజెపి లక్కీ..

AP BJP: దేశంలో ఏ రాష్ట్రంలో లేని అదృష్టం భారతీయ జనతా పార్టీకి( Bhartiya Janata Party) ఏపీ నుంచి మాత్రమే దక్కుతోంది. ఇక్కడ భాగస్వామ్య పక్షాలు బిజెపికి మద్దతు తెలుపుతున్నాయి. ప్రత్యర్థి పార్టీలు సైతం బిజెపికి జై కొడుతున్నాయి. ఇటీవల మహిళా రిజర్వేషన్ బిల్లు పార్లమెంట్లో పెట్టింది కేంద్రం. ఎన్డీఏ లో తెలుగుదేశం పార్టీతో పాటు జనసేన ఉంది. ఆ రెండు పార్టీలు ఎలాగూ మద్దతు చెబుతాయి. వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ సైతం మద్దతు తెలపడం విశేషం. అయితే ఈ ఒక్క బిల్లు విషయంలోనే మాత్రం కాదు. రాజకీయంగా బిజెపికి కేంద్రంలో ఏ అవసరం వచ్చిన భాగస్వామ్య పార్టీలతో పాటు వైసిపి మద్దతు ఇవ్వడం విశేషం. ఈ రాష్ట్రంలో కూడా ఇటువంటి పరిణామాలు చూడలేం. బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎలాగు ప్రతిపక్షం ఆ పార్టీని వ్యతిరేకిస్తుంది. కానీ అసలు ఉనికి అంతంతమాత్రంగా ఉన్న ఏపీ నుంచి బిజెపికి సంపూర్ణ మద్దతు దొరుకుతుండడం మాత్రం నిజంగా గొప్ప విషయం.
* అన్ని పార్టీల మద్దతు కూడా..
రాజకీయాల్లో సిద్ధాంతపరంగా పార్టీల మధ్య బేధం ఉంటుంది. కచ్చితంగా ఒక పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యర్థి పార్టీ ప్రతిపక్షంలో ఉంటుంది. పరస్పరం అవి విభేదించుకుంటాయి కూడా. కానీ ఏపీ విషయానికి వచ్చేసరికి మాత్రం ఆ పరిస్థితి లేదు. ఏపీలో టీడీపీ కూటమిలో బిజెపి ఉంది. బిజెపి నేతృత్వంలోని కేంద్రంలో ఉన్న ఎన్డీఏ( National democratic Alliance) ప్రభుత్వంలో టిడిపి కీలక భాగస్వామిగా ఉంది. కానీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వాన్ని వ్యతిరేకిస్తున్నారు జగన్మోహన్ రెడ్డి. కానీ కేంద్రంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వానికి అన్ని అంశాల్లో మద్దతు తెలుపుతున్నారు. ఒక విధంగా చంద్రబాబు, జగన్మోహన్ రెడ్డిని పక్కన పెడితే మాత్రం.. కేంద్రంలో అధికారంలో ఉన్న బిజెపి ఏపీ విషయంలో గొప్ప అదృష్ట అవకాశాన్ని కొనసాగిస్తూ వస్తోంది. అందుకే కేంద్రంలో విపక్ష కూటమి ఏపీని పట్టించుకోవడం మానేసింది.
* ఎంపీ సీట్లన్నీ బిజెపివే..
రాష్ట్రంలో 25 పార్లమెంట్ సీట్లు ఉన్నాయి. మరో పదకొండు రాజ్యసభ సీట్లు ఉన్నాయి. ఇందులో కేవలం 3 లోక్సభ స్థానాలతో పాటు ఒక రాజ్యసభ పదవి మాత్రమే బిజెపి. కానీ కేంద్రానికి అవసరమైన పక్షంలో 25 మంది లోక్సభ సభ్యులతో పాటు 11 మంది రాజ్యసభ సభ్యులు బిజెపి నేతృత్వంలోని ఎన్డీఏ కు సంపూర్ణ మద్దతు తెలుపుతున్నారు. చిన్నాచితక పార్టీలు సైతం ఎన్డీఏను వ్యతిరేకిస్తున్నాయి. కానీ ఏపీలో మాత్రం ప్రధాన పార్టీలన్నీ గుంప గుత్తిగా మద్దతు తెలుపుతున్నాయి. ఇది బిజెపికి లక్కీ. 2014 నుంచి మోడీ నేతృత్వంలో ఎన్డీఏ ఈ లక్కీ కొనసాగిస్తోంది.
0
0
0
0
0
0
0