Silver Purity: పాపం తెలుసా.. వెండి కొంటున్న ప్రతి ముగ్గురిలో ఒకరు మోసపోతున్నారంట! ఎలాగో తెలుసా?

Silver Purity: దేశంలో వెండికి క్రమంగా డిమాండ్ పెరుగుతున్న తరుణంలో ఒక విస్తుపోయే నిజం వెలుగులోకి వచ్చింది. భారతదేశంలో వెండి కొనుగోలు చేస్తున్న ప్రతి ముగ్గురు వినియోగదారులలో ఒకరు స్వచ్ఛత విషయంలో మోసపోతున్నారని ‘లోకల్‌సర్కిల్స్’ నిర్వహించిన తాజా సర్వే వెల్లడించింది. అక్షయ తృతీయ పండుగ వేళ వెండి నాణేలు, ఆభరణాలు కొనేవారు అప్రమత్తంగా ఉండాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు.
READ ALSO: IPL Record: ఐపీఎల్ కింగ్ కోహ్లీ కాదు.. ఎవరో తెలుసా? విస్తుపోయే గణాంకాలు..
సర్వేలో తేలిన చేదు నిజాలు ఇవే..
గత ఐదేళ్లలో వెండి కొనుగోలు చేసిన వారిపై జరిపిన ఈ సర్వేలో సంచలన విషయాలు బయటపడ్డాయి. 31% మంది వినియోగదారులు తాము కొన్న వెండిలో స్వచ్ఛత లేదని, నాణ్యత విషయంలో మోసపోయామని అంగీకరించారు. 93% మంది ప్రజలు వెండికి కూడా బంగారం తరహాలోనే హాల్‌మార్కింగ్‌ను ప్రభుత్వం తప్పనిసరి చేయాలని డిమాండ్ చేస్తున్నారు. కేవలం 2% మంది మాత్రమే హాల్‌మార్కింగ్ అవసరం లేదని అభిప్రాయపడ్డారు. నిజానికి ఈ రోజుల్లో పెట్టుబడిగా, ఫ్యాషన్ ఆభరణాలుగా వెండికి ఆదరణ పెరుగుతోంది. 2026 నాటికి కిలో వెండి ధర రూ.1.7 లక్షల నుంచి రూ.1.9 లక్షల మధ్య ఉండవచ్చని అంచనా. ధరలు ఇంత భారీగా పెరుగుతున్న తరుణంలో, నాణ్యత విషయంలో కఠినమైన నిబంధనలు లేకపోతే వినియోగదారులు మరింత నష్టపోయే ప్రమాదం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.
స్వచ్ఛతను గుర్తించడం ఎలా..
వినియోగదారుల రక్షణ కోసం బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ (BIS) ఇప్పటికే కొన్ని గ్రేడ్‌లను ఖరారు చేసింది. వెండి స్వచ్ఛతను బట్టి 800, 835, 925, 958, 970, 990, 999 అనే ఏడు గ్రేడ్‌లుగా విభజించారు. అలాగే ప్రతి హాల్‌మార్క్‌లో BIS గుర్తు, స్వచ్ఛతా గ్రేడ్, ఒక ప్రత్యేకమైన HUID కోడ్ ఉండాలి. సెప్టెంబర్ 1, 2025 తర్వాత హాల్‌మార్క్ చేసిన ఉత్పత్తుల వివరాలను వినియోగదారులు తమ ఫోన్‌లోని BIS కేర్ యాప్ ద్వారా స్వయంగా వెండి స్వచ్ఛతను తనిఖీ చేసుకోవచ్చు. ఇదే సమయంలో వినియోగదారులకు నాణ్యమైన వెండిని అందించేందుకు దేశవ్యాప్తంగా హాల్‌మార్కింగ్ కేంద్రాలను ప్రభుత్వం విస్తరిస్తోంది. 2026 నాటికి 110 జిల్లాల్లో సుమారు 300కు పైగా కొత్త కేంద్రాలు అందుబాటులోకి రానున్నాయి. దీనివల్ల సామాన్య ప్రజలకు తమ నగలు లేదా నాణేల స్వచ్ఛతను పరీక్షించుకోవడం మరింత సులభతరం కానుంది. ధరలు ఆకాశాన్ని తాకుతున్న వేళ, వెండి కొనేటప్పుడు కేవలం మెరుపును చూసి మోసపోకుండా.. హాల్‌మార్క్ గుర్తును, HUID కోడ్‌ను తప్పనిసరిగా తనిఖీ చేసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.
0
0
0
0
0
0
0