USA: డాలర్ కలలు కల్లలు.. అమెరికా నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న భారతీయులు..

23, 2026 - 17:32
 0
USA:  డాలర్ కలలు కల్లలు.. అమెరికా నుంచి వెళ్లిపోవాలనుకుంటున్న భారతీయులు..
American Dream Fading Indian Americans Leaving Us Survey

USA: అమెరికా అనేది చాలా మంది భారతీయుల కల. డాలర్ డ్రీమ్స్, మెరుగైన జీవన విధానం, డాలర్లలో సంపాదన ఉంటుందని ప్రతీ ఒక్కరు యూఎస్ వెళ్లాలని అనుకుంటారు. అక్కడే స్థిరపడాలని కోరుకుంటారు. ఎన్ఆర్ఐ అంటేనే మన దేశంలో ,ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల్లో ఒక గౌరవంగా చూస్తారు. ఇక తల్లిదండ్రులు ఎన్‌ఆర్ఐ సంబంధాలు అంటే కోట్ల రూపాయలు వరకట్నంగా ఇచ్చుకుని తమ కూతుళ్లను కట్టబెడుతారు. అయితే, ఇదంతా గతం కాబోతోంది. అమెరికాలో నివసిస్తున్న చాలా మంది భారతీయలు ఇప్పుడు స్వదేశం లేదా వేరే ఇతర దేశాలకు మకాం మార్చాలని అనుకుంటున్నారు.

Read Also: Darling Re-release: రీ-రిలీజ్‌లో ‘డార్లింగ్’ విధ్వంసం.. మైండ్ బ్లాకింగ్ కలెక్షన్స్!

కార్నెగీ ఎండోమెంట్, యూగోవ్‌తో కలిసి నిర్వహించిన ఒక సర్వే ప్రకారం, అమెరికాలోని భారతీయ సమాజం తీవ్ర ఆందోళనలో ఉందని చెప్పింది. సుమారు 40 శాతం మంది అమెరికాను విడిచివెళ్లిపోవాలని ఆలోచిస్తున్నట్లు తేలింది. ఈ సర్వేలో 1000 మందిని ప్రశ్నించగా.. 14 శాతం మంది తరుచుగా, 26 శాతం మంది అప్పుడప్పుడు యూఎస్ విడిచి వెళ్లిపోవాలని ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు. 58 శాతం మంది అమెరికాలోని రాజకీయ పరిస్థితులే కారణమని వెల్లడించగా, 54 శాతం మంది జీవనవ్యయం, 41 శాతం మంది వ్యక్తిగత భద్రత ప్రధాన కారణమని చెప్పారు. ప్రస్తుతం అమెరికాలో 5.2 మిలియన్ల మంది భారతీయ మూలాలు ఉన్న ప్రజలు నివసిస్తున్నారు.

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్‌పై భారత సమాజం తీవ్ర ఆగ్రహంగా ఉన్నట్లు సర్వేలో తేలింది. ఆయన ఆర్థిక విధానం, వలస విధానం, అంతర్జాతీయ సంబంధాల నిర్వహణపై 71 శాతం మంది అసంతృప్తి వ్యక్తం చేశారు. అమెరికా అమెరికన్ల కోసమే అనే ట్రంప్ నినాదం వలసదారుల్లో భయాలను పెంచుతోందని విశ్లేషకులు చెబుతున్నారు. అమెరికాలో జీవన వ్యయం పెరగడం ప్రధాన కారణమని మరికొంత మంది చెబుతున్నారు. శాన్‌ఫ్రాన్సిస్కో, సియాటెల్, న్యూయార్క్ వంటి నగరాల్లో అద్దెలు 3000-5000 డాలర్ల వరకు ఉన్నాయని, పిల్లల్ని పెంచడానికి 3 లక్షల డాలర్ల వరకు ఖర్చు అవుతుందని అంచనా వేస్తున్నారు. ఇదే కాకుండా గ్రీన్ కార్డులు ఆలస్యం కావడం, వీసా బ్యాక్‌లాగ్స్, ఫారిన్ పాలసీ అనిశ్చితి వంటి సమస్యలు భారతీయ సమాజంలో ఆందోళనల్ని పెంచుతోంది.

0
0
0
0
0
0
0