Prashanth Neel 418: మైత్రీ – ప్రశాంత్ నీల్ ‘418’ టైటిల్ పోస్టర్ రిలీజ్ ..

19, 2026 - 14:00
 0
Prashanth Neel 418: మైత్రీ – ప్రశాంత్ నీల్ ‘418’ టైటిల్ పోస్టర్ రిలీజ్ ..
Mythri Movie Makers Prashanth Neel 418 Movie Title Poster Horror

టాలీవుడ్ టాప్ ప్రొడక్షన్ హౌస్ మైత్రీ మూవీ మేకర్స్ ఇప్పుడు రూట్ మార్చింది. కమర్షియల్ ఎంటర్‌టైనర్లకు కేరాఫ్ అడ్రస్‌గా ఉండే ఈ సంస్థ, తొలిసారిగా పక్కా హారర్ జోనర్‌లోకి అడుగుపెడుతోంది. కె.జి.ఎఫ్ ఫేమ్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ సమర్పణలో, కీర్తన్ నాదగౌడ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రం టైటిల్ ‘418’. తాజాగా విడుదలైన ఈ సినిమా టైటిల్ పోస్టర్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Allso Read : Parshuraam: హోంబలే సినిమాటిక్ యూనివర్స్ నుంచి..పరశురామ్ భారీ అనౌన్స్‌మెంట్!

ఈ సినిమా ట్యాగ్‌లైన్ చాలా పవర్‌ఫుల్‌గా ఉంది.. “హారర్ సినిమాల్లో నవ్వింది చాలు.. ఇక భయపడాల్సిన సమయం వచ్చింది” (Enough of laughing in horror movies. Now it’s time to be scared). ఇటీవలి కాలంలో హారర్ సినిమాల్లో కామెడీ ఎక్కువైపోయి భయం తగ్గిపోయిందనేది ప్రేక్షకుల ఫీలింగ్. ఆ లోటును భర్తీ చేస్తూ, కేవలం భయాన్ని మాత్రమే పంచే ‘ప్యూర్ హారర్’ చిత్రంగా ‘418’ రాబోతోందని ఈ ట్యాగ్‌లైన్ ద్వారా డైరెక్టర్ స్పష్టం చేశారు. రిలీజ్ చేసిన టైటిల్ పోస్టర్‌లో రక్తం మరకలతో ఉన్న ఒక తలుపు, దానిపై ‘418’ అనే నంబర్ కనిపిస్తున్నాయి.

ఈ పోస్టర్ చూస్తుంటే ఇది సైకలాజికల్ హారర్ లేదా ఒక మిస్టరీ గది చుట్టూ తిరిగే కథ అని అర్థమవుతోంది. ఇందులో సూర్య రాజ్, చరణ్ లక్కరాజు, ప్రీతి పగడల్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్నారు. మాస్ సినిమాలకు కేరాఫ్ అడ్రస్ అయిన ప్రశాంత్ నీల్ ఈ ప్రాజెక్ట్‌ను ప్రెజెంట్ చేస్తుండటంతో సినిమా రేంజ్ ఒక్కసారిగా పెరిగిపోయింది. ఆయన సినిమాల్లో ఉండే ‘డార్క్ థీమ్’ ఈ హారర్ మూవీకి కూడా తోడైతే, థియేటర్లలో ఆడియెన్స్‌కు ఒక కొత్త అనుభూతి లభించడం ఖాయం. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ దశలో ఉంది.

0
0
0
0
0
0
0