PM Modi: సభలో భావోద్వేగం… చిన్నారి చూపిన అమ్మ ఫోటోతో మోడీ కంటతడి!

19, 2026 - 17:01
 0
PM Modi: సభలో భావోద్వేగం… చిన్నారి చూపిన అమ్మ ఫోటోతో మోడీ కంటతడి!
Pm Modi Emotional Moment Bengal Rally Child Photo

PM Modi: పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు మరికొన్ని రోజులు సమయం మాత్రమే ఉంది. ఈ నేపథ్యంలో రాజకీయ పార్టీలు తమ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఆదివారం రోజు ప్రధాని నరేంద్రమోడీ బెంగాల్ ఎన్నికల ప్రచారంలో పాల్గొన్నారు. ఆయన పురూలియాలో జరిగిన భారీ బహిరంగ సభలో మాట్లాడుతూ భావోద్వేగానికి గురయ్యారు. తన ప్రసంగాన్ని మధ్యలో ఆపేసి, చిన్నారితో మాట్లాడారు. తన ప్రసంగం మధ్యలో చిరాగ్ అనే చిన్నారిని చూసి అకస్మాత్తుగా భావోద్వేగానికి లోనయ్యారు. వెంటనే ఆయన మాట్లాడటం ఆపేశారు.

Read Also: Ali Khamenei: ఇరాన్‌లో భయం ఇంకా తగ్గలేదు… ఖమేనీ అంత్యక్రియలు నెలరోజులుగా వాయిదా!

చిన్నారి ప్రధాని మోడీ, ఆయన తల్లి ఉన్న ఫోటోను ప్రదర్శించాడు. ఇది చూసిన ఆయన తన వద్దకు ఫోటో తీసుకుమ్మని తన భద్రతా సిబ్బందిని ఆదేశించారు. తన తల్లి ఫోటోను చూడగానే భావోద్వేగానికి గురయ్యారు. ‘‘మా అమ్మ ఫోటో తెచ్చినందుకు చాలా ధన్యవాదాలు. నన్ను భావోద్వేగానికి గురిచేశావు’’ అని అన్నారు. ప్రధాని తమతో మాట్లాడినందుకు చాలా సంతోషంగా ఉందని చిరాగ్, అతడి తల్లి చెప్పారు. ప్రధాని మోడీ తనకు లేఖ రాస్తానని చెప్పినట్లు చిరాగ్ తెలిపారు.

పశ్చిమ బెంగాల్‌లోని 294 స్థానాలకు రెండు దశల్లో పోలింగ్ జరగనుంది. 152 స్థానాలకు ఏప్రిల్ 23, 2026న, 142 స్థానాలకు ఏప్రిల్ 29, 2026న పోలింగ్ జరుగుతుంది. ఎన్నికల ఫలితాలను మే 4, 2026న ప్రకటిస్తారు. ఈ ఎన్నికల్లో బీజేపీ, టీఎంసీ మధ్య తీవ్ర పోటీ నెలకొంది. ఈసారి ఎలాగైనా అధికారంలోకి రావాలని బీజేపీ అనుకుంటోంది. మరోవైపు, తన ఆధిపత్యాన్ని నిరూపించుకోవాలని టీఎంసీ ప్రచారం చేస్తోంది.

0
0
0
0
0
0
0