శృతి హాసన్ కోసం 'పెద్ది' టీం అంత బడ్జెట్ ఖర్చు చేస్తుందా.. ఇది చాలా ఓవర్ గురూ..

Peddi Item Song Budget: గ్లోబల్ స్టార్ రామ్ చరణ్(Global Star Ram Charan) హీరో గా నటిస్తున్న ‘పెద్ది'(Peddi Movie) చిత్రం షూటింగ్ , కేవలం ఒక్క ఐటెం సాంగ్ మినహా మొత్తం పూర్తి అయ్యిందని అంటున్నారు మేకర్స్. ప్రస్తుతానికి ఈ చిత్రం లోని ‘రయ్ రయ్ రారా’ పాటకు సంబంధించిన ప్యాచ్ ఓక్ర్ ని పూర్తి చేస్తున్నారు. గత మూడు రోజుల నుండి దాదాపుగా 300 డ్యాన్సర్స్ తో రామ్ చరణ్ పై ఈ పాటకు సంబంధించిన ప్యాచ్ వర్క్ ని నడుపుతున్నారు. ఇక ఆ తర్వాత ఈ నెల 26 నుండి ఐటెం సాంగ్ షూటింగ్ మొదలు కాబోతుంది. మృణాల్ ఠాకూర్, మానస వారణాసి, సంయుక్త మీనన్, ఇలా ఇంత మంది హీరోయిన్స్ ని సంప్రదించిన తర్వాత , ఇప్పుడు శృతి హాసన్ ని లాక్ చేశారు మేకర్స్. అభిమానులు ట్రెండింగ్ లో ఉన్న హీరోయిన్స్ ని తీసుకోకుండా , శృతి హాసన్ ని తీసుకోవడం పై కాస్త అసంతృప్తి తో ఉన్న విషయం వాస్తవమే కానీ, సినిమా అనుకున్న సమయానికి పూర్తి అయితే చాలని అనుకుంటున్నారు ఫ్యాన్స్.
ఇకపోతే శృతి హాసన్ కి ఈ ఐటెం సాంగ్ కోసం దాదాపుగా 4 కోట్ల రూపాయిల రెమ్యూనరేషన్ ని ఇస్తున్నారు అట. అంతే కాకుండా ఆమె కోసం వచ్చే అసిస్టెంట్స్, ఆమె ఉండే హోటల్ ఖర్చులు, ఇలా అన్నిటికి కలిపి 5 కోట్ల రూపాయలకు పైగానే శృతి హాసన్ కోసం ఖర్చు చేస్తున్నారట. అంత డబ్బులు ఆమె కోసం పెట్టే బదులు, శ్రీలీల , సమంత, పూజ హెగ్డే, భాగ్యశ్రీ భొర్సే వంటి క్రేజీ హీరోయిన్స్ ని పెట్టుకుంటే సినిమాకు చాలా ప్లస్ అయ్యేది కదా అని సోషల్ మీడియా లో అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. వీళ్ళెవ్వరూ కాకుండా, హిందీ టాప్ హీరోయిన్స్ తో ఈ ఐటెం సాంగ్ ని చేయించి ఉంటే కచ్చితంగా బాలీవుడ్ లో ఓపెనింగ్స్ కి బాగా కలిసొచ్చేది అని అంటున్నారు.
ఇకపోతే ఈ సినిమా నుండి ఇప్పటి వరకు విడుదలైన ప్రతీ ప్రమోషనల్ కంటెంట్ అను బాంబు లాగా పేలింది అనే చెప్పాలి. సినిమా మీద అంచనాలను తారా స్థాయికి తీసుకెళ్లేలా చేశాయి. ముఖ్యంగా ‘చికిరి చికిరి’ పాట అయితే గ్లోబల్ వైడ్ గా ఒక సెన్సేషన్. ‘రయ్ రయ్’ పాటకు కూడా మంచి రెస్పాన్స్ అయితే వచ్చింది కానీ , ‘చికిరి చికిరి’ తో పోలిస్తే చాలా తక్కువ అనే చెప్పొచ్చు. అదే విధంగా రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా విడుదల చేసిన గ్లింప్స్ వీడియో కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక ఐటెం సాంగ్ కి ఎలాంటి రెస్పాన్స్ వస్తుందో చూడాలి.
0
0
0
0
0
0
0