జనరల్ కోచ్ లను గరీబ్ గాడీలు అంటారు గాని.. వాటి వల్ల రైల్వేకు ఎంత లాభమో తెలుసా

21, 2026 - 22:01
 0
జనరల్ కోచ్ లను గరీబ్ గాడీలు అంటారు గాని.. వాటి వల్ల రైల్వేకు ఎంత లాభమో తెలుసా
Indian Railways General Coaches

Indian Railways General Coaches: చాలామంది మనుషుల మధ్య కులాలు.. మతాలు అంతరాలు సృష్టిస్తాయని అంటారు గాని.. అది నూటికి నూరు శాతం నిజం కాదు. ఎందుకంటే మనుషులలో అంతరాన్ని సృష్టించేది కేవలం డబ్బు మాత్రమే. డబ్బుంటే కులాన్ని చూడరు, మతాన్ని కూడా చూడరు. కేవలం మొదటి డాబు, దర్పాన్ని మాత్రమే చూస్తారు.. ఎందుకంటే డబ్బు అనేది ఈ ప్రపంచాన్ని శాసిస్తుంది. డబ్బున్న వాళ్ళు మిగతా వారి మీద పెత్తనం సాగిస్తుంటారు. డబ్బున్న వ్యక్తులను గౌరవించే మన సమాజం.. డబ్బు లేని వారిని ఈసడించుకుంటుంది. చివరికి ప్రయాణించే చోట కూడా దూరం పెడుతుంది.

మనదేశంలో అతిపెద్ద రవాణా వ్యవస్థల్లో రైల్వే శాఖ ముందు వరుసలో ఉంటుంది. దేశవ్యాప్తంగా రైల్వే శాఖకు కనెక్టివిటీ ఉంది. అరుణాచల్ ప్రదేశ్ నుంచి మొదలుపెడితే జమ్మూ కాశ్మీర్ వరకు ప్రతిరోజు మనదేశంలో రైళ్లు పట్టాల మీద పరుగులు పెడుతూనే ఉంటాయి.. రవాణా మాత్రమే కాకుండా.. కార్గో సేవలు కూడా అందిస్తుంటాయి. రైల్వే శాఖ ప్రతి ఏడాది వేలాది కోట్ల ఆదాయాన్ని సంపాదిస్తూ ఉంటుంది. రైల్వే శాఖ ముఖ్యంగా మనుషుల రవాణాకు సంబంధించిన రైళ్లల్లో జనరల్ కోచ్ లు ఏర్పాటు చేస్తూ ఉంటుంది. ఇవి ఇంజన్ భాగానికి వెనక లేదా చివర్లో మాత్రమే ఉంటాయి. వాస్తవానికి ఇవి ఇలా ఉండడానికి ఒక శాస్త్రీయపరమైన కారణం ఉంది. వాస్తవానికి ఇలాంటి ఒక విషయం ఉందని ఎవరికి తెలియదు.

జనరల్ కోచ్ లలో ఎక్కువ శాతం పేదలు ఎక్కుతుంటారు. జనరల్ కోచ్ లు కనుక చివర్లో ఉంటే ప్లాట్ఫారం మీద రద్దీ ఒకే చోట ఉండదు. దీంతో ఎటువంటి తొక్కిసలాట జరగకుండా ఉంటుంది. అత్యవసర సమయాల్లో.. లేదా ప్రమాదాలు చోటు చేసుకున్నప్పుడు ప్రయాణికులు త్వరగా బయటపడేందుకు ఇది దోహదపడుతుంది. అంతేకాదు రైలు బరువును సమానంగా ఉంచడంలో సహాయపడుతుంది.

గతంలో అన్ని రైళ్లకు జనరల్ కోచ్ లు నాలుగు వరకు ఉండేవి. రెండు ఇంజన్ వెనక.. మిగతా రెండు చివర్లో ఉండేవి. అయితే రైల్వే శాఖ తీసుకున్న నిర్ణయాల వల్ల ఇప్పుడు వాటి సంఖ్య రెండు కు పడిపోయింది. అవి ఇంజన్ వెనకా లేదా రైలు చివరి భాగంలో ఉంటున్నాయి. జనరల్ కోచ్ ల సంఖ్యను తగ్గించడం వల్ల ప్రయాణికుల నుంచి ఆగ్రహం వ్యక్తం అవుతున్నప్పటికీ.. రైల్వే శాఖ మాత్రం తగ్గడం లేదు. తన నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవడం లేదు.

కేవలం జనరల్ కోచ్ ల విషయంలోనే కాదు.. ప్యాసింజర్ రైళ్ల విషయంలో కూడా రైల్వే శాఖ అనేక నిర్ణయాలు తీసుకుంది. కరోనా తర్వాత చాలావరకు ప్యాసింజర్ రైళ్లను రైల్వే శాఖ రద్దు చేసింది. ఎక్కువగా గూడ్స్ రవాణాకు ప్రయారిటీ ఇస్తోంది. సర్వీస్ కంటే.. ఆదాయాన్ని సంపాదించుకోవడమే లక్ష్యంగా రైల్వే శాఖ అడుగులు వేస్తోంది. ఇది చాలామందికి ఇబ్బందిగా అనిపించినప్పటికీ.. ప్రభుత్వం అలాంటి చర్యలు తీసుకుంటున్నప్పుడు ప్రజలు మాత్రం ఏం చేయగలరు.

0
0
0
0
0
0
0