అల్లు అర్జున్ ముంబై కి షిఫ్ట్ అవ్వడంపై క్లారిటీ ఇచ్చిన అల్లు అరవింద్..

Allu Aravind: గత రెండు మూడు రోజులుగా సోషల్ మీడియా లో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Icon Star Allu Arjun) హైదరాబాద్ నుండి పూర్తిగా ముంబై కి షిఫ్ట్ అవుతున్నాడు, ఇక మీదట ఆయన అక్కడే ఉంటాడు, ఎప్పుడైనా షూటింగ్స్ ఉన్నప్పుడు మాత్రమే హైదరాబాద్ కి తిరిగి వస్తాడు అంటూ అనేక రకమైన కామెంట్స్ చక్కర్లు కొట్టిన సంగతి తెలిసిందే. ఇది విన్న అభిమానులు అల్లు అర్జున్ ఇప్పటికిప్పుడు ముంబై కి వెళ్లాల్సిన అవసరం ఏంటి?, ఆయన మూలాలు మొత్తం హైదరాబాద్ లోనే ఉన్నాయి, పిల్లలు కూడా హైదరాబాద్ లోనే చదువుకుంటున్నారు, అలాంటిది ఇలాంటి సమయం లో ముంబై కి మకాం మార్చేయాలని ఎందుకు అనుకుంటున్నాడు అంటూ అభిమానుల్లో భారీ గానే చర్చలు నడిచాయి. అయితే ఈ అంశం పై అల్లు అర్జున్ తండ్రి , ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ స్పందించాడు.
ఆయన మాట్లాడుతూ ‘సోషల్ మీడియా లో గత రెండు మూడు రోజులుగా జరుగుతున్న ప్రచారం లో ఎలాంటి నిజం లేదు. బన్నీ పిల్లలు ఇక్కడే చదువుకుంటున్నారు , మా కుటుంబ సభ్యులు , స్నేహితులందరూ హైదరాబాద్ లోనే అన్నారు. అన్ని సౌకర్యాలు ఉన్నటువంటి హైదరాబాద్ ని వదిలి ముంబా కి వెళ్లాల్సిన అవసరం ఏముంది. బన్నీ ముంబై లో ఇల్లు కొన్నాడు అంటూ వస్తున్న వార్తలు కేవలం పుకార్లు మాత్రమే, కాకపోతే అక్కడ ఈమధ్య షూటింగ్ ఎక్కువగా చేస్తుండడం వాళ్ళ ఒక లగ్జరీ ఇంటిని అద్దెకు తీసుకున్న విషయం వాస్తవమే’ అంటూ చెప్పుకొచ్చాడు. అల్లు అరవింద్ ఇచ్చిన ఈ క్లారిటీ తో అల్లు అర్జున్ ముంబై కి షిఫ్ట్ అవుతున్నాడు అనే వార్తలకు తెరపడింది. ప్రస్తుతం అల్లు అర్జున్ ముంబై లో ‘రాకా’ మూవీ షూటింగ్ లో బిజీ గా ఉన్నాడు. రీసెంట్ గానే ఆయన పుట్టినరోజుకి విడుదలైన ఫస్ట్ లుక్ పోస్టర్ కి అభిమానుల నుండి , ప్రేక్షకుల నుండి సెన్సేషనల్ రెస్పాన్స్ వచ్చిన సంగతి తెలిసిందే.
అల్లు అర్జున్ తన ప్రతీ సినిమాలో లుక్స్ దగ్గర నుండే వైవిద్యం చూపుతాడు. ఆ కారణం చేత ఆయనపై ప్రేక్షకుల్లో మొదటి నుండి అంచనాలు భారీ రేంజ్ లో ఉంటాయి . ఆ అంచనాలకు మించి అల్లు అర్జున్ అందరినీ సర్ప్రైజ్ కి గురి చేయడం కొత్తేమి కాదు , మొదటి నుండి జరుగుతూ వస్తోంది , ‘రాకా’ విషయం లో కూడా అదే జరిగింది. ఇకపోతే ఈ సినిమా తర్వాత ఆయన తమిళ స్టార్ డైరెక్టర్ లోకేష్ కనకరాజ్ తో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ ఏడాది సెకండ్ హాఫ్ నుండి ఈ సినిమాకు సంబంధించిన షూటింగ్ కూడా మొదలు కాబోతుంది.
0
0
0
0
0
0
0