'ధురంధర్ 2: ది రివెంజ్' 17 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఇలా అయితే 'బాహుబలి 2' ని కొట్టడం కష్టమే..

5, 2026 - 19:01
 0
'ధురంధర్ 2: ది రివెంజ్'  17 రోజుల వరల్డ్ వైడ్ వసూళ్లు..ఇలా అయితే 'బాహుబలి 2' ని కొట్టడం కష్టమే..
Dhurandhar 2 17 Days Worldwide Collections

Dhurandhar 2 17 Days Worldwide Collections: భారీ ఓపెనింగ్స్ తర్వాత ‘ధురంధర్ 2′(Dhurandhar 2 : The Revenge) చిత్రం బాక్స్ ఆఫీస్ వద్ద డ్రాప్స్ ని సొంతం చేసుకున్న విషయం వాస్తవమే. ముఖ్యంగా ఈ సినిమాపై IPL సీజన్ ఎఫెక్ట్ మామూలు రేంజ్ లో లేదు. ఫలితంగా కచ్చితంగా 2000 కోట్ల మార్కుని దాటి , సరికొత్త బెంచ్ మార్క్ ని ఏర్పాటు చేస్తుందని అనుకున్న ఈ సినిమా , ఇప్పుడు ‘బాహుబలి 2’ ని దాటడం కూడా కష్టం అనొచ్చు. ఆ రేంజ్ లో వసూళ్లు పడిపోయాయి. కానీ ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద నెలకొల్పిన కొన్ని అరుదైన రికార్డ్స్ ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. ముఖ్యంగా సౌత్ నుండి ఈ చిత్రానికి వచ్చిన గ్రాస్ వసూళ్లు , ఇప్పటి వరకు ఏ హిందీ సినిమాకు కూడా రాలేదు. భవిష్యత్తులో రావడం కూడా కష్టమే.

సౌత్ రాష్ట్రాల్లో అత్యధిక వసూళ్లను రాబట్టిన రాష్ట్రంగా కర్ణాటక నిల్చింది. ఈ ప్రాంతం నుండి ఈ చిత్రానికి 120 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. కేజీఎఫ్ సిరీస్ , కాంతారా సిరీస్ , బాహుబలి 2 మినహా , మరో సినిమాకు ఈ ప్రాంతం నుండి ఈ రేంజ్ గ్రాస్ వసూళ్లు నమోదు అవ్వలేదు. అదే విధంగా తెలంగాణ ప్రాంతం నుండి 63 కోట్ల 30 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టగా , ఆంధ్ర ప్రదేశ్ నుండి 26 కోట్లు, తమిళనాడు నుండి 34 కోట్ల 52 లక్షలు , కేరళ నుండి 17 కోట్ల 66 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టింది. ఓవరాల్ గా ఈ చిత్రానికి సౌత్ స్టేట్స్ నుండి 262 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఫుల్ రన్ లో 300 కోట్ల మార్కుని కూడా దాటొచ్చని అంటున్నారు. సౌత్ స్టేట్స్ లో బాషలవారీగా వచ్చిన వసూళ్లను చూస్తే హిందీ నుండి 193 కోట్ల రూపాయిలు రాగా , తెలుగు నుండి 43 కోట్లు , తమిళం నుండి 20 కోట్లు, కన్నడ నుండి 3 కోట్ల 23 లక్షలు , మలయాళం నుండి 2 కోట్ల రూపాయిలు వాచినట్టు తెలుస్తోంది.

ఇక 17 వ రోజున బాషల వారీగా ఈ చిత్రానికి వచ్చిన గ్రాస్ వసూళ్లను ఒకసారి చూస్తే హిందీ నుండి 25 కోట్ల 66 లక్షల రూపాయిలు, తెలుగు నుండి 1 కోటి రూపాయిలు , తమిళం నుండి 64 లక్షలు, కన్నడ నుండి 19 లక్షలు, మలయాళం నుండి 4 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. ఓవరాల్ గా ఇండియా వైడ్ గా ఈ చిత్రానికి 32 కోట్ల 36 లక్షల రూపాయిల గ్రాస్ వసూళ్లు, 27 కోట్ల 43 లక్షల రూపాయిల నెట్ వసూళ్లు వచ్చాయి. ఇక ఓవర్సీస్ నుండి ఈ చిత్రానికి దాదాపుగా 1 మిలియన్ డాలర్ల గ్రాస్ వసూళ్లు వచ్చాయి . ఇండియన్ కరెన్సీ ప్రకారం 9 కోట్ల 27 లక్షలు అన్నమాట. ఓవరాల్ గా 17 వ రోజున ఈ చిత్రానికి 42 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు రాగా, వరల్డ్ వైడ్ గా 17 రోజులకు కలిపి 1604 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లు వచ్చాయి. బాహుబలి 2 ని అందుకోవాలంటే మరో 250 కోట్ల రూపాయలకు పైగా గ్రాస్ వసూళ్లు రావాలి.

0
0
0
0
0
0
0