ఇది ఉప్పల్ పిచ్చా.. పిచ్చి లేపారు కదరా

Hyderabad Vs Lucknow Match Pitch: ఉప్పల్ మైదానంలో హైదరాబాద్ ఆటగాళ్లు కొడితే తుప్పల్లో బంతిపడుతుంది అంటారు. ఈ మాటను అనేక సందర్భాలలో వ్యాఖ్యాతలు ఉపయోగించారు. హైదరాబాద్ జట్టు ఉప్పల్ మైదానంలో ఆడిన ప్రతి సందర్భంలోనూ భారీ స్కోర్లు నమోదు అయ్యాయి. ఎందుకంటే ఈ మైదానం మీద హైదరాబాద్ ఆటగాళ్లకు విపరీతమైన పట్టు ఉంది. అందువల్లే ఆ స్థాయిలో పరుగులు నమోదయ్యాయి.
అన్ని రోజులు ఒకే విధంగా ఉండవు అన్నట్టుగా.. హైదరాబాద్ ఆటగాళ్లకు ఉప్పల్ మైదానంలో ఆదివారం లక్నో జట్టుతో జరిగిన మ్యాచ్లో చేదు అనుభవం ఎదురయింది. టాస్ ఓడిపోయి ముందుగా బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ ప్లేయర్లకు అడుఅడుగునా చుక్కలు కనిపించాయి. బంతి బ్యాట్ మీదకి రాలేదు. కనీసం బౌన్స్ కూడా కాలేదు. అలాగని బ్యాక్అప్ లెంత్ గా కూడా రాలేదు. మొత్తంగా చూస్తే హైదరాబాద్ ఆటగాళ్లకు చుక్కలు కనిపించాయి. భీకరమైన అభిషేక్ శర్మ.. ప్రమాదకరమైన హెడ్.. విజృంభించే క్లాసెన్.. బీభత్సంగా ఆడే లివింగ్ స్టోన్.. ఇలా నలుగురు ఆటగాళ్లు చేతులెత్తేశారు. చూస్తుండగానే పెవిలియన్ క్యూ కట్టారు.
ఇటీవల కాలంలో హైదరాబాద్ మైదానంలో ఒక జట్టు పరుగులు చేయడంలో ఇబ్బంది పడడం ఇదే తొలిసారి. ఈ పిచ్ ప్లాట్ గా ఉంటుందని.. పరుగులు రావడం సులభం అవుతుందని మొదట్లో వార్తలు వినిపించాయి. దాదాపు ఆటగాళ్లు కూడా అదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. కానీ హైదరాబాద్ జట్టు ఇన్నింగ్స్ మొదలైన తొలి ఓవర్ నుంచే సీన్ రివర్స్ అయింది. అసలు మైదానంలో ఏం జరుగుతుందో అర్థం కాని పరిస్థితి ఏర్పడింది. ప్లేయర్లు పరుగులు తీయడం కాదు కదా.. కనీసం వికెట్లు కాపాడుకుంటే అదే పది వేలు అన్నట్టుగా పరిస్థితి మారిపోయింది. భారీగా పరుగులు వస్తాయని.. 300 స్కోర్ లోడింగ్ అవుతుందని భావించిన అభిమానులకు మైదానంలో ప్రతిక్షణం ఇబ్బందికరమైన పరిస్థితి ఎదురైంది.
పిచ్ మీద కనీసం జీవం లేదని.. గ్రాస్ కూడా సరిగా వేయలేదని.. వాటర్ క్యూరింగ్ సరిగా లేకపోవడంతో బంతి బ్యాట్ మీదకి రాలేదని వ్యాఖ్యాతలు పేర్కొన్నారు. అందువల్లే హైదరాబాద్ జట్టు బ్యాటర్లు స్కోర్ చేయలేకపోయారని అభిప్రాయపడ్డారు. బంతి స్వింగ్ అవడం.. లేదా వికెట్ల మీదికి రావడంతో బ్యాటర్లు ఇబ్బంది పడ్డారు. ఇలాంటి పిచ్ ఇప్పటివరకు జరిగిన ఐపీఎల్ మ్యాచ్ల్లో ఎక్కడా రూపొందించలేదంటే హైదరాబాద్ క్రికెట్ సంఘం ఎలా వ్యవహరిస్తుందో అర్థం చేసుకోవచ్చు.
Lala with the new ball >>>>> pic.twitter.com/Zz7XBJbm5W
— Lucknow Super Giants (@LucknowIPL) April 5, 2026
0
0
0
0
0
0
0