ఆర్కే కొత్త పలుకు: దక్షిణాదికి మోడీ షా అన్యాయం సరే గాని.. ఈ విషయాలు ఎలా మర్చిపోయారు ఆర్కే

19, 2026 - 11:01
 0
ఆర్కే కొత్త పలుకు: దక్షిణాదికి మోడీ షా అన్యాయం సరే గాని.. ఈ విషయాలు ఎలా మర్చిపోయారు ఆర్కే
RK Kotha Paluku

RK Kotha Paluku: ఆంధ్రజ్యోతిలో ఆ పత్రిక ఎండీ వేమూరి రాధాకృష్ణ రాసే రాతలు ఒక విస్పోటనం మాదిరిగా ఉంటాయి. మిగతావారి లెక్క దాపరికం ఉంటూ ఉండదు. ఉన్నది ఉన్నట్టు (కొన్ని సందర్భాల్లో అది సాధ్యం కాదు), కుండ బద్దలు కొట్టినట్టు రాధాకృష్ణ రాస్తుంటారు. అందువల్లే ఆయన రాసే రాత లకు సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. ఆయన రాతల వల్ల నొచ్చుకున్న రాజకీయ నాయకులు చాలామంది ఉన్నారు. నిరసనలు చేపట్టి.. ఆందోళనలు చేసిన వారి గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.

ఈ వారం కొత్త పలుకులో డీ లిమిటేషన్, మహిళా రిజర్వేషన్ బిల్లు గురించి రాధాకృష్ణ రాసుకొచ్చారు. నరేంద్ర మోడీ, అమిత్ షా ఎలా వ్యవహరిస్తున్నారు.. దీనివల్ల భారతీయ జనతా పార్టీకి భవిష్యత్తు కాలంలో జరిగే నష్టమేంటి.. డీలిమిటేషన్ వల్ల కోల్పోయే స్థానాలు..ఇది రాజకీయంగా దక్షిణాది రాష్ట్రాల మీద ఎలాంటి ప్రభావం చూపిస్తుంది.. అనే అంశాల మీద రాధా కృష్ణ రాసుకొచ్చారు. ఇందులో వాస్తవం ఉన్నప్పటికీ.. రాధాకృష్ణ కొత్త పలుకు నుంచి ఇటువంటివి కాదు తెలుగు ప్రేక్షకులు ఊహించేది.

రాధాకృష్ణ పత్రికలో సరిగ్గా కొద్ది రోజుల క్రితం నరేంద్ర మోడీకి ఎదురేలేదు.. ఇప్పుడు జరిగే ఎన్నికల్లో ఆయన ఆధ్వర్యంలో బిజెపి సత్తా చూపిస్తుందని రాశారు. కాంగ్రెస్ పార్టీ దరిదాపుల్లో లేదని.. ప్రతిపక్షాలకు అంత సీన్ లేదని చెప్పుకొచ్చారు. డీ లిమిటేషన్ బిల్లు వీగిపోగానే నరేంద్ర మోడీ గురించి రాధాకృష్ణ వ్యతిరేకంగా రాశారు. అనేక సందర్భాల్లో రాజ్యసభలో సరైన బలం లేకపోయినప్పటికీ.. బిల్లులను ఆమోదింప చేసుకున్నారు మోడీ, షా. అటువంటి వారికి మహిళా రిజర్వేషన్ బిల్లును,డీ లిమిటేషన్ బిల్లును ఆమోదింప చేసుకోవడం తెలియదా.. భారతీయ జనతా పార్టీ మఠం కాదు. అదికూడా రాజకీయాలను మాత్రమే చేస్తుంది. ఆ మాత్రం రాధాకృష్ణకు తెలియదా..

త్వరలో ఎన్నికలు జరగబోతున్నాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు వీగిపోవడం వల్ల మహిళలకు ప్రతిపక్షాలు వ్యతిరేకమనే భావనను ప్రజల్లో కలిగించడానికి మోడీ షా ప్రయత్నించారు. అందువల్లే కావాలని వెనక్కి తగ్గారు. ప్రతిపక్షాలు తాత్కాలిక ఆనందంలో ఉంటే ఉండవచ్చును గాని.. తదుపరి జరిగే పరిణామాలను అవి అంచనా వేయడంలో విఫలమయ్యాయి. మహిళా రిజర్వేషన్ బిల్లు.. డీలిమిటేషన్ బిల్లు ను ఈ క్షణమైనా సరే మళ్లీ పార్లమెంట్లో ప్రవేశపెట్టడానికి మోడీషా వెనుకాడరు. ఈలోగా వారు కోరుకున్న రాజకీయ ప్రయోజనాలు సిద్ధించిన తర్వాత బలమైన అడుగులు వేస్తారు.

దక్షిణాది రాష్ట్రాలలో 50% సీట్లు పెరుగుతాయని చంద్రబాబుకు తెలుసు కాబట్టి.. ఆయన నిశ్శబ్దంగా ఉన్నారని రాధాకృష్ణ రాశారు. జనాభా ప్రాతిపదికన సీట్ల పెంపు అనుకున్నప్పుడు దక్షిణాది రాష్ట్రాలలో ఆ స్థాయిలో సీట్లు ఎలా పెరుగుతాయి? అసలు సీట్ల పెంపు ఎలా చేస్తారు? దానికి ప్రాతిపదిక ఏమిటి అనే విషయం మీద ఇంతవరకు కేంద్రమే క్లారిటీ ఇవ్వలేదు. కనీసం ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల పార్టీలతో సమావేశం కూడా ఏర్పాటు చేయలేదు. అలాంటప్పుడు చంద్రబాబు ఎలా నమ్ముతారు.. ఇదే విషయాన్ని రేవంత్ రెడ్డి ప్రస్తావించారు కదా.. అంతేకాదు మహారాష్ట్రలో షిండే, బీహార్లో నితీష్ కుమార్ కు పట్టిన గతి చంద్రబాబుకు పడుతుందని రేవంత్ రెడ్డి ఆరోపించారు కదా.. మరి దీని గురించి రాధాకృష్ణ ఒక మాట కూడా మాట్లాడలేదు ఎందుకు.. కెసిఆర్ గురించి, జగన్ గురించి అడ్డు అనేది లేకుండా రాసి పడేసిన రాధాకృష్ణ.. రేవంత్ విషయానికి వచ్చేసరికి ఎందుకు సైలెంట్ అయిపోయారు.. చంద్రబాబు విషయంలో ఎందుకు షుగర్ కోటెడ్ వ్యవహారం సాగించారు.. ఇవి తెలియని స్థితిలో తెలుగు పాఠకులు లేరు.. పాపం రాధాకృష్ణ..

0
0
0
0
0
0
0