Mallikarjun Kharge: ప్రధాని నరేంద్రమోడీ ఒక టెర్రరిస్ట్.. కాంగ్రెస్ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు..

21, 2026 - 16:02
 0
Mallikarjun Kharge: ప్రధాని నరేంద్రమోడీ ఒక టెర్రరిస్ట్.. కాంగ్రెస్ చీఫ్ వివాదాస్పద వ్యాఖ్యలు..
Mallikarjun Kharge Sparks Row With Remarks On Pm Modi Later Issues Clarification

Mallikarjun Kharge: కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ప్రధాని నరేంద్రమోడీని ఉద్దేశిస్తూ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. చెన్నైలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని మోడీ ఒక ఉగ్రవాది అని, ఆయన పార్టీ సమానత్వ సూత్రాన్ని విశ్వసించదని అన్నారు. అన్నా డీఎంకే ప్రజాస్వామ్యాన్ని బలహీనపరుస్తోందని చెప్పారు. పెరియార్, అంబేద్కర్ సూత్రాలకు వ్యతిరేకంగా పనిచేస్తుందని దుయ్యబట్టారు. అయితే.. ఈ వాఖ్యలపై స్పష్టతనిస్తూ తాను ఉగ్రవాది అని అనలేదని, వారు ప్రజల్ని భయపెడుతున్నారని అన్నానని చెప్పారు.

Read Also: Bishnoi Gang: క్రికెట్‌లోకి లారెన్స్ బిష్ణోయ్ గ్యాంగ్ ఎంట్రీ.. టీ20 వరల్డ్ కప్‌ మ్యాచ్ ఫిక్సింగ్‌లో సంచలన విషయాలు!

ఉగ్రవాదితో అన్నాడీఎంకే ఎలా పొత్తు పెట్టుకుంటుందని ప్రశ్నించారు. మోడీ ప్రజాస్వామ్యాన్ని హరిస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మోడీ ఎప్పుడూ బెదిరిస్తుంటారని తాను స్పష్టం చేయాలని అనుకున్నానని, ఐటీ, ఈడీ వంటికి ఆయన చేతుల్లో ఉన్నాయని, దక్షిణాది రాష్ట్రాల హక్కుల్ని ఆయన కాలరాస్తున్నారని దుయ్యబట్టారు. ప్రధాని మోడీ ఒక అబద్ధాలకోరు, ఆయన మహిళలకు వ్యతిరేకమని విమర్శించారు. పేదలకు వ్యతిరేకంగా ఉన్నారని దుయ్యబ్టారు.

0
0
0
0
0
0
0