Donald Trump: భారత్ చాలా మంచి మిత్రుడు.. ట్రంప్ మరో యూ-టర్న్..

Donald Trump: అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ రెండు నాల్కల ధోరణి మరోసారి బయటపడింది. ఒక రోజు క్రితం భారతీయులపై జాత్యాంహంకార వ్యాఖ్యలు చేసిన ట్రంప్, ఇప్పుడు భారత్ మంచి మిత్రుడని కొనియాడారు. ఒక్క రోజులోనే ట్రంప్ యూటర్న్ తీసుకున్నారు. భారతదేశంపై గురువారం ప్రశంసలు కురిపించారు. ‘‘భారత్ చాలా మంచి మిత్రుడు’’ అని ట్రంప్ వ్యాఖ్యానించారు. ఒక రోజు ముందు భారత్, చైనాలు నరకకూపాలు అంటూ కామెంట్ చేశారు.
Read Also: TCS Nashik Case: ఛాతి వైపు అసభ్యంగా చూపులు… పిల్లల కోసం మౌల్వీని కలవమని ఒత్తిడి
న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయ ప్రతినిధి క్రిస్టోఫర్ ఎల్మ్స్ తెలిపిన ప్రకారం.. ట్రంప్ భారతదేశాన్ని గొప్ప దేశంగా అభివర్ణిస్తూ.. ఆ దేశ నాయకుడితో(ప్రధాని మోడీ)తో తనకు వ్యక్తిగత స్నేహం ఉందని పేర్కొన్నట్లు, భారత్ గురించి ఆప్యాయంగా మాట్లాడినట్లు చెప్పారు. ‘‘భారత్ ఒక గొప్ప దేశం, ఉన్నతస్థాయిలో ఉన్న చాలా మంచి స్నేహితుడు’’ అంటూ ట్రంప్ కొనియాడారు.
దీనికి ముందు రోజు,అమెరికన్ పొలిటికల్ వ్యాఖ్యాత, రేడియో హోస్ట్ మైఖేల్ సావేజ్ భారతీయులు, చైనీయులపై జాత్యాంహకార వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యల్ని ట్రంప్ సమర్థిస్తూ రీపోస్ట్ చేశారు. భారత్, చైనా ఇతర దేశాలను ‘‘నరకాలు’’గా అభివర్ణించారు. అమెరికా జన్మహక్కు పౌరసత్వంపై సుప్రీంకోర్టు వాదనల్ని సావేజ్ తీవ్రంగా విమర్శిస్తూ, చట్టంలో మార్పులు తీసుకురావాలని డిమాండ్ చేశారు. అమెరికాలో జన్మహక్కు పౌరసత్వం ద్వారా ఇక్కడ ఒక బిడ్డ అమెరికన్ పౌరుడిగా మారుతారని, ఆ తర్వాత చైనా, భారత్ ఇతర నరకూపాల నుంచి వారి మొత్తం కుటుంబాన్ని అమెరికాకు తీసుకువస్తారని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. భారత్, చైనా వలసదారుల్ని ‘‘ల్యాప్ టాప్ కలిగిన గ్యాంగ్స్టర్లు’’గా అభివర్ణించారు. మాఫియా కుటుంబాలు ఈ దేశానికి చేసిన నష్టాని కన్నా వీరే ఈ దేశానికి ఎక్కువ నష్టం చేస్తారని ఆరోపించారు. భారతీయుల వల్ల అమెరికాలోని ప్రజలకు అవకాశాలు తగ్గాయని అన్నారు.
0
0
0
0
0
0
0