హద్దులు దాటిన నాని 'ది ప్యారడైజ్' బడ్జెట్.. 120 కోట్లు అనుకుంటే ఎంత అయ్యిందో తెలుసా..

24, 2026 - 16:02
 0
హద్దులు దాటిన నాని 'ది ప్యారడైజ్' బడ్జెట్.. 120 కోట్లు అనుకుంటే ఎంత అయ్యిందో తెలుసా..
Nani The Paradise Budget 200 Crores

Nani The Paradise Budget 200 Crores: హీరో మార్కెట్ కి మించి బడ్జెట్ ని పెడితే నష్టాలు తప్ప , ఏది మిగిలేలా లేదు అనేది వాస్తవం. ఒకవేళ బడ్జెట్ ఆ రేంజ్ లో పెడితే, అందుకు తగ్గ కంటెంట్ కూడా ఉండాలి. లేదంటే చాలా నష్టాలను చూడాల్సి ఉంటుంది. అందుకు రీసెంట్ ఉదాహరణ ‘బైకర్’. శర్వానంద్ హీరో గా నటించిన ఈ చిత్రానికి ఆడియన్స్ నుండి మంచి పాజిటివ్ టాక్ వచ్చింది. కానీ శర్వానంద్ మార్కెట్ కి మించి 50 కోట్ల రూపాయలకు పైగా బడ్జెట్ ఖర్చు చేయడం తో బ్రేక్ ఈవెన్ మార్కుని అందుకోలేకపోయింది. ఫలితంగా డిజాస్టర్ ఫ్లాప్ అయ్యింది. ఇప్పుడు హీరో నాని(Natural Star Nani) కి కూడా అలాంటి పరిస్థితి రాబోతోందా?, ఆయన హీరో గా నటిస్తున్న లేటెస్ట్ చిత్రం ‘ది ప్యారడైజ్'(The Praradise Movie) పై అంచనాలు తారా స్థాయిలో ఉన్నాయి. కానీ బడ్జెట్ మాత్రం లిమిట్స్ దాటిపోతు ఉంది.

ముందుగా ఈ చిత్రానికి 120 కోట్ల రూపాయిల బడ్జెట్ తో నిర్మించాలని అనుకున్నారు. ఇది ఒకరకంగా పర్వాలేదు , రికవరీ అయ్యే రేంజ్ బడ్జెట్ అని చెప్పొచ్చు. ఎందుకంటే నాని సినిమాలు యావరేజ్ గా ఉన్న 50 కోట్ల షేర్ మార్కుని దాటేస్తున్నాయి , ఇక పెద్ద హిట్ అంటే మాత్రం 120 కోట్ల షేర్ ని రాబట్టడం పెద్ద కష్టమేమి కాదు. పైగా ఈ చిత్రానికి మొదటి రోజ్ 75 కోట్ల రూపాయిల గ్రాస్ వసూళ్లను రాబట్టేంత సత్తా ఉంది. కానీ ఇప్పుడు శ్రీకాంత్ అడ్డాల నాన్ స్టాప్ గా రీ షూట్స్ కి వెళ్లడం, సినిమాని అనుకున్న బడ్జెట్ లో పూర్తి చేయకపోవడం వల్ల , వడ్డీలు బాగా పెరిగి 200 కోట్ల రూపాయిల రేంజ్ లో బడ్జెట్ అయ్యేలా ఉందని అంటున్నారు. ఇప్పటి వరకు మన టాలీవుడ్ లో 200 కోట్ల షేర్ ఉన్న హీరోలు పవన్ కళ్యాణ్ , ప్రభాస్, ఎన్టీఆర్ మాత్రమే.

కానీ ఇక్కడ ‘ప్యారడైజ్’ బడ్జెట్ 200 కోట్లు ఉంది. దానికి తగ్గ బిజినెస్ జరుగుతుందా అంటే అనుమానమే. నాని కి ఆడియన్స్ లో మంచి బ్రాండ్ ఇమేజ్ ఉండడం వల్ల, అదే విధంగా నెట్ ఫ్లిక్స్ లో ఆయన సినిమాలకు భారీ వ్యూస్ రావడం వల్ల, ఆ సంస్థ మంచి రేట్ ఇవ్వొచ్చు. కానీ హిట్ అయితేనే మంచి రేట్ కి ఈ సినిమా అమ్ముడుపోతుంది, లేదా మాట్లాడుకున్న రేట్ కి 50 శాతం తగ్గిపోతుంది. ఇక థియేటర్స్ నుండి ఈ చిత్రం 200 కోట్ల రూపాయిల షేర్ వసూళ్లను రాబట్టాలంటే , హిందీ లో భారీ బ్లాక్ బస్టర్ గా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తెలుగు మార్కెట్ తో 200 కోట్ల షేర్ ని కొట్టడం అసాధ్యం. మరి నాని కి ఇవన్నీ తెలిసి కూడా ఇంత బడ్జెట్ పెట్టడానికి ఒప్పుకుంటున్నాడు అంటే , కంటెంట్ మీద ఆయనకు ఏ రేంజ్ నమ్మకం ఉందో అర్థం అవుతోంది అంటూ సోషల్ మీడియా లో నెటిజెన్స్ కామెంట్స్ చేస్తున్నారు.

0
0
0
0
0
0
0