'జైలర్ 2' లో అతిథి పాత్ర పోషించడానికి పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేయడానికి కారణం అదేనా..

24, 2026 - 22:02
 0
'జైలర్ 2' లో అతిథి పాత్ర పోషించడానికి పవన్ కళ్యాణ్ రిజెక్ట్ చేయడానికి కారణం అదేనా..
Pawan Kalyan Jailer 2

Pawan Kalyan Jailer 2: సౌత్ ఇండియా లో విపరీతమైన క్రేజ్ ని సొంతం చేసుకున్న పాన్ ఇండియన్ చిత్రాల్లో ఒకటి ‘జైలర్ 2′(Jailer 2 Movie). 2023 వ సంవత్సరం లో రజినీకాంత్(Super Star Rajinikanth), నెల్సన్ దిలీప్ కుమార్(Nelson Dileep Kumar) కాంబినేషన్ తెరకెక్కిన ‘జైలర్’ చిత్రానికి ఇది సీక్వెల్. అందుకే ఈ సీక్వెల్ పై ఈ రేంజ్ క్రేజ్ ఏర్పడింది. ఆగస్టు నెలలో ఈ చిత్రం మన ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి. రీసెంట్ గానే షూటింగ్ కార్యక్రమాలు కూడా పూర్తి అయ్యాయి. అందుకు సంబంధించిన ఫోటోలను సోషల్ మీడియా లో మేకర్స్ షేర్ చేయగా, అవి బాగా వైరల్ అయ్యాయి. అయితే ఈ చిత్రం లో ఒక పవర్ ఫుల్ గెస్ట్ రోల్ కోసం చాలా మంది హీరోలను సంప్రదించారు. ముందుగా బాలకృష్ణ ని అడిగారు , ఆయన కొన్ని కారణాల చేత ఒప్పుకోలేదు. ఆ తర్వాత షారుఖ్ ఖాన్ ని సంప్రదించారు , ఆయన కూడా ఎందుకో ఒప్పుకోలేదు.

చివరికి మన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ని సంప్రదించారు. ఆయన ససేమీరా నో చెప్పడం గమనార్హం. ఎందుకంటే పవన్ కళ్యాణ్ ఇప్పుడు తన తదుపరి చిత్రం సురేందర్ రెడ్డి తో చేయబోతున్న సంగతి తెలిసిందే. అందుకు తగ్గట్టుగా ఆయన మేకోవర్ కూడా అయ్యాడు. ఇప్పుడు ‘జైలర్ 2’ లో అతిధి పాత్ర చెయ్యాలంటే కచ్చితంగా ఆ లుక్ ని మార్చాల్సి ఉంటుంది. అలా చేయడం ఇష్టం లేకనే ఆయన ఈ చిత్రం లో నటించడానికి ఒప్పుకోలేదు. దానికి తోడు పవన్ కళ్యాణ్ కి ఈమధ్య కాలం లో ఆరోగ్యం సరిగా ఉండకపోవడం, ఉప ముఖ్యమంత్రి బాధ్యతలు చేపడుతున్నాడు కాబట్టి , పాలనలో ఫుల్ బిజీ గా ఉండడం వల్ల, డేట్స్ కేటాయించడం కుదరదని చెప్పాడట. ఈ కారణాల చేతనే పవన్ కళ్యాణ్ ‘జైలర్ 2’ ఆఫర్ ని రిజెక్ట్ చేసినట్టు తెలుస్తోంది.

ఒకవేళ పవన్ కళ్యాణ్ ఒప్పుకొని చేసి ఉండుంటే మూవీ లవర్స్ కి విజువల్ ఫీస్ట్ లాగా ఉండేది. స్క్రీన్ ప్రెజెన్స్ కి ఇండియా లో సరైన నిర్వచనం లాంటి హీరోలు రజినీకాంత్ , పవన్ కళ్యాణ్. అలాంటి సూపర్ స్టార్స్ ఒకే ఫ్రేమ్ లో స్టైల్ గా నడుచుకొని రావడం , అది కూడా అనిరుద్ బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో ఒక్కసారి ఊహించుకోండి, ఏ రేంజ్ లో ఉండేదో . అంతే కాదు ‘జైలర్ 2’ కి తెలుగు రాష్ట్రాల నుండి సెన్సేషనల్ ఓపెనింగ్ కూడా దక్కేది. ప్రస్తుతానికి ఆ సినిమాకు 20 కోట్ల షేర్ తెలుగు రాష్ట్రాల నుండి ఓపెనింగ్ కొట్టే సత్తా ఉంది , ఒకవేళ పవన్ కళ్యాణ్ ఈ సినిమాలో నటించి ఉండుంటే దాని రేంజ్ 40 కోట్ల ఓపెనింగ్ తో ఉండేది. సెన్సేషనల్ కాంబినేషన్ ని ఈ విధంగా మిస్ అయ్యినందుకు పవన్ ఫ్యాన్స్ బాధపడుతున్నారు.

0
0
0
0
0
0
0