ఎన్టీఆర్ - అనిల్ రావిపూడి కాంబోలో రావాల్సిన రెండు సినిమాలు మిస్ అవ్వడానికి కారణం ఇదే...

Jr NTR Anil Ravipudi Combo: జూనియర్ ఎన్టీఆర్ హీరోగా వచ్చిన చాలా సినిమాలు అతన్ని టాప్ హీరోగా మార్చాయి. కెరియర్ స్టార్టింగ్ లో మాస్ సినిమాలను ఎక్కువగా చేసిన ఆయన ఆ తర్వాత కమర్షియల్ సినిమాల వైపు అడుగులు వేశాడు. అలాగే బృందావనం లాంటి ఒక ఫ్యామిలీ ఓరియెంటెడ్ సినిమాని చేసి ప్రేక్షకులను మెప్పించాడు. ప్రస్తుతం ఆయన నుంచి వచ్చిన ప్రతి సినిమా ఏదో ఒక వైవిధ్యాన్ని సంతరించుకుంటుందని చెప్పడంలో ఎంత మాత్రం అతిశయోక్తి లేదు. ఇప్పుడు ఆయన ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో డ్రాగన్ అనే సినిమా చేస్తున్నాడు. ఈ సినిమాతో ఎలాగైనా సరే తనకంటూ ఒక ఐడెంటిటి ఏర్పాటు చేసుకోవాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాడు. ఈ సినిమా తర్వాత త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకుంటున్నాడు…ఇక తెలుగు సినిమా ఇండస్ట్రీలో కమర్షియల్ డైరెక్టర్ గా పేరు సంపాదించుకున్న వాళ్ళలో అనిల్ రావిపూడి ఒకరు. ఇప్పటివరకు ఆయన చేసిన తొమ్మిది సినిమాలతో సూపర్ సక్సెస్ లను సాధించాడు. అపజయం ఎరుగని దర్శకుడిగా పేరు పొందాడు.
మరి అలాంటి అనిల్ రావిపూడి జూనియర్ ఎన్టీఆర్ తో ఒక సినిమా చేయడానికి సన్నాహాలు చేసుకున్నప్పటికి అది కార్యరూపం దాల్చలేదు. రవితేజ తో రాజా ది గ్రేట్ అనే సినిమా చేసి సూపర్ సక్సెస్ ని సాధించిన అనిల్ రావిపూడి మొదట ఈ సినిమా కథని ఎంటైర్ కి వినిపించారట. ఈ కథ మీద ఎంటర్ అంత పెద్దగా ఇంట్రెస్ట్ చూపించకపోవడంతో రవితేజ తో ఈ సినిమాని చేసి సూపర్ సక్సెస్ ని సాధించాడు…
ఇక మహేష్ బాబుతో చేసిన ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమా సైతం సూపర్ సక్సెస్ ని సాధించింది. అయితే ఈ సినిమా తర్వాత జూనియర్ ఎన్టీఆర్ కి అని రావిపూడి మరొక కథనైతే వినిపించాడట. కానీ ఎన్టీఆర్ మాత్రం ఆ కథ తనకి పెద్దగా సెట్ కాదని పాన్ ఇండియా రేంజ్ ఏదైనా కథ ఉంటే చెప్పమని అడిగాడట.
కానీ అప్పటికి అనిల్ రావిపూడి దగ్గర అలాంటి కథ లేకపోవడంతో ఫ్యూచర్లో మనం కలిసి సినిమా చేద్దాం…ప్రస్తుతానికైతే మంచి కథ రెడీ చేసుకుని రమ్మని జూనియర్ ఎన్టీఆర్ చెప్పారట. దాంతో అనిల్ రావిపూడి సైతం ఎన్టీఆర్ కోసం ఒక మంచి కథను రెడీ చేసే పనిలో బిజీగా ఉంటూనే హీరోలతో సినిమాలు చేసుకుంటూ ముందుకు సాగుతున్నాడు…
0
0
0
0
0
0
0