అత్యధిక కార్లను ఉత్పత్తి చేసిన మారుతి సుజుకీ.. ఎంతో తెలుసా..

23, 2026 - 19:02
 0
అత్యధిక కార్లను ఉత్పత్తి చేసిన మారుతి సుజుకీ.. ఎంతో తెలుసా..
Maruti Suzuki highest car production

Maruti Suzuki highest car production: దేశంలో అత్యధిక కార్ల సేల్స్ లో నెంబర వన్ స్థానంలో ఉండే Maruthi Suzuki కంపెనీ మరో మైలు రాయిని అధిగమించింది. 2025-26 ఆర్థిక సంవత్సరంలో (ఏప్రిల్ 2025 నుంచి మార్చి 2026 వరకు) ఈ కార్ల కంపెనీ 23.4 లక్షల కార్లను ఉత్పత్తి చేసి రికార్డు సృష్టించింది. భారతదేశంలోని అటోమొబైల్ తయారీదారుల సంఘం (సియామ్) ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించింది. ఒక్క ఏడాదిలో ఇంత పెద్ద సంఖ్యలో కార్లు తయారు చేసిన ఏకైక కంపెనీగా మారుతీ సుజుకీ నిలవడం గురించి ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. అంతేకాకుండా ఇది భారతీయ ఆటో సెక్టార్‌లో ఒక చారిత్రక అంచనా అని కొనియాడుతున్నారు. దీని గురించి పూర్తి వివరాల్లోకి వెళితే..

కార్ల ఉత్పత్తిలో మారుతి సుజుకీ కంపెన ప్రత్యేక ఘనతను సాధించింది. ఈ సందర్భంగా మారుతి సుజుకీ మేనేజింగ్ డైరెక్టర్, సీఈవో, హిసాషి టకేయుచి మాట్లాడారు. నాలుగున్నర దశాబ్దాలుగా ఉద్యోగులు, డీలర్లు, వెండర్ల సపోర్టుతో ఈ ఉత్పత్తికి సాధ్యమైందని అన్నారు. మరోవైపు ప్రభుత్వ విధాన నిర్ణయాలు కూడా కలిసివచ్చాయని పేర్కొన్నారు. ప్రస్తుత ఉత్పత్తి సామర్థ్యాన్ని 40 లక్షల యూనిట్లకు పెంచామని తెలిపారు గత సంవత్సరం 2024-25లో 22 లక్షలకు పైగా ఉత్పత్తి చేసిన మారుతీ సుజుకీ, ఈ సంవత్సరం 6% పెరుగుదల సాధించి 23.4 లక్షలు చేరింది. ఈ కంపెనీకి చెందిన అత్యధిక ఉత్పత్తి అయిన కార్లలో డిజైర్, ఫ్రాంక్స్, స్విప్ట్, ఎర్టిగా, బాలెనో వంటి మోడళ్లు ఈ ఉత్పత్తిలో ప్రధాన పాత్ర పోషించాయి. హర్యానాలోని గురుగ్రామ్, మనేసర్, ఖర్కోడా.. గుజరాత్ లోని హన్సల్ పూర్ లో ఈ ఉత్పత్తి జరిగింది.

సియామ్ డేటా ప్రకారం, భారతదేశంలోని ఇతర పెద్ద కంపెనీలు హ్యుండాయ్ (సుమారు 8-9 లక్షలు), టాటా మోటార్స్ (6-7 లక్షలు), మహీంద్రా (5-6 లక్షలు) వంటివి ఈ స్థాయిని చేరలేదు. ప్రపంచంలోనూ టోయోటా, వోక్స్ వాగన్ వంటివి సైతం సంవత్సరానికి 1 కోటి కార్లు తయారు చేస్తున్నా, ఒకే యూనిట్ ప్లాంట్‌లతో 23.4 లక్షలు చేసే సామర్థ్యం మారుతీ సుజుకీకి మాత్రమే ఉందని కంపెనీ తెలుపుతోంది. ఈ సాధన భారతదేశ ఆటో ఎక్స్‌పోర్ట్‌లో కూడా పెరుగుదలకు దారితీసింది 2025-26లో 2.5 లక్షల కార్లు ఎగుమతులయ్యాయి.

ఈ రికార్డు వెనుక కారణాలు ఎవరూ ఊహించని స్థాయిలో డిమాండ్, సరఫరా చైన్ స్థిరత్వం, ఎలక్ట్రిక్ వెహికల్స్‌పై దృష్టి వంటివి ఉన్నాయి. మారుతీ సుజుకీ e-విటారా, ఈ-స్విఫ్ట్ వంటి EVలపై దృష్టి పెట్టి, హైబ్రిడ్ మోడల్స్‌తో మార్కెట్ లో పైచేసి సాధిస్తోంది. భవిష్యత్తులో 2026-27కి 25 లక్షల లక్ష్యంతో కొత్త ప్లాంట్‌లు ఏర్పాటు చేయనున్నారు.

0
0
0
0
0
0
0